మూగబోయిన ముషీరాబాద్

Musheerabad Leader Expired

ఓ మీసాల సూర్యుడా!
ఓ బులెట్ వీరుడా!
కూలి, నాలి వర్గానికి పెద్ద దిక్కు నీవు
కార్మిక లోకానికి అండదండవు నీవు
నీ మరణ వార్త విని
వీఎస్టీ చిన్నబోయింది
ముషీరాబాద్ మూగ బోయింది
పలు కంపెనీల కార్మికులు కన్నీరు,మున్నీరవుతున్నారు
నర్సన్నా మళ్ళీ నీవు రావా
మా పీడిత, తాడిత జనానికి రక్షకుడిగా నిలువవా.
కార్మిక పక్షపాతి నాయిని కి నివాళి అంటూ సమస్త కార్మిక లోకం చెబుతోంది. ఆయన పార్థివ దేహాన్ని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ కు తరలించారు. దీంతో మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులంతా అక్కడికి తరలి వెళుతున్నారు. చివరి సారిగా తమ ప్రియనేతకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

#Nayani NarasimhaReddy Expired

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *