దూకుడు పెంచుతోన్న నాగార్జున

2
Nag new movie
Nag new movie

Nag latest movie

అక్కినేని నాగార్జున.. సోగ్గాడే చిన్ని నాయనాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న తర్వాత వేగంగా దూసుకువెళ్లాలనుకున్నాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ వరుసగా ఫ్లాపులు వచ్చాయి. మరోవైపు తనయుడు అఖిల్ ను నిలబెట్టాలన్న ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అఖిల్ హ్యాట్రిక్ ఫ్లాపులతో బ్యాడ్ ఎంట్రీ అనిపించుకున్నాడు. ఇక అఖిల్ ను అల్లు అరవింద్ చేతిలో పెట్టి తను కొత్త సినిమా మొదలుపెట్టాడు. కొత్త దర్శకుడు సాల్మన్ తో కలిసి ‘వైల్డ్ డాగ్’లా రాబోతున్నాడు నాగ్. ఈ మూవీ షూటింగ్ స్వింగ్ లో ఉండగానే కరోనా వచ్చింది. పైగా కొన్ని రోజుల పాటు విదేశీ లొకేషన్స్ లో షూటింగ్ ఉంది. దీంతో అందర్లానే పూర్తిగా ఆగిపోయింది. నిజానికి వైల్డ్ డాగ్ మొదలు కావడానికి ముందు చాలా మంది ఇక నాగ్ పని ఐపోయింది అనే కమెంట్స్ కూడా చేశారు. బట్.. ఆ కమెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నాడేమో.. మెల్లగా స్పీడ్ పెంచుతున్నాడట ఈ ఓల్డ్ మన్మథుడు. వైల్డ్ డాగ్ పూర్తి కాగానే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో సినిమా దాదాపు కన్ఫార్మ్ అయింది. ఈ కాంబినేషన్ కూడా కొత్తగానే ఉంటుందని చెప్పొచ్చు.

తన ప్రతి సినిమాకూ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో వస్తోన్న ప్రవీణ్ సత్తారు.. ఈ సారి నాగ్ ను ఫ్యామిలీ మేన్ గా అదీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చూపించాలనుకుంటున్నాడని సమాచారం. ఇక ప్రవీణ్ మూవీ ఫైనల్ అవగానే మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నాడట నాగ్. నిజానికి ఈ సినిమా గురించి గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఈ మూవీని ఓకే చేసినట్టు సమాచారం. బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రైడ్’మూవీని తెలుగులో నాగ్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా చేయాలని నాగ్ కూడా చాలా రోజులుగా అనుకుంటున్నాడు. మొత్తంగా వైల్డ్ డాగ్ ఇంకా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అది పూర్తి కాగానే.. ప్రవీణ్ మూవీతో పాటు రైడ్ నూ ప్రారంభించాలనుకుంటున్నారట. అ సినిమాను ఓ కొత్త దర్శకుడి చేతిలో పెట్టాలనుకుంటున్నట్టు టాక్. మరోవైపు సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ ‘బంగార్రాజు’ సైతం లైన్ లోనే ఉంది. మొత్తంగా వైల్డ్ డాగ్ తర్వాత ఒకేసారి మరో మూడు ప్రాజెక్ట్స్ తో నాగ్ కూడా దూకుడు పెంచుతున్నాడన్నమాట.

tollywood news