మెగా బ్రదర్ నాగబాబు ఎంపీ అయితే హద్దులు లేకుండా పని చేస్తారట !

Mega Brother Naga Babu MP is working without bounds

ఏపీలో అనేక అలజడుల మధ్య పోలింగ్ ముగిసింది .పోలింగ్ ముగిసినా సంచలనాలు మాత్రం ఆగటం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రధాన పార్టీల అధినేతలు చెలరేగిపోతుంటే జనసేన పార్టీ నుండి బరిలోకి దిగిన నర్సాపూర్ ఎంపీ అభ్యర్థి మెగా బ్రదర్ నాగబాబు నేను కూడా ఏమి తక్కువ తినలేదు అంటూ సంచలనాలకు తెరతీశారు .

ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముందు యూట్యాబ్ ఛాన‌ల్‌లో వ‌రుస సంచ‌ల‌న వీడియోల‌తో వార్త‌ల్లో నిలిచిన మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు తాజాగా మ‌ళ్లీ మొద‌లుపెట్టారు. న‌ర‌సాపురం ఎంపీగా జ‌న‌సేన త‌రుపున నాగ‌బాబు పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ద‌ఫా ఎంపీగా గెలిస్తే ఆకాశ‌మే హ‌ద్దుగా ప‌నిచేస్తాన‌ని నాగ‌బాబు త‌న ఫేస్ బుక్ లైవ్‌లో ప్రేర్కొన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

చాలా రోజుల త‌రువాత మ‌ళ్లీ మీ ముందుకు వ‌చ్చా. తాజాగా జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేశాను. ఫ‌లితం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఫ‌లితం ఎలా వ‌స్తుందో తెలియ‌దు. అయితే ఇక్క‌డ గెల‌వ‌డం నాకు చాలా ముఖ్యం. అయితే పాజిటీవ్ రిజ‌ల్టే వ‌స్తుంద‌ని భావిస్తున్నా. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌లు నాపై చూపిన ప్రేమ‌కు నా జీవితాన్ని వాళ్ల‌కి అంకితం చేయాల‌నిపించింది. నేను ఎంపీగా గెలిస్తే హ‌ద్దులు లేకుండా ప‌నిచేస్తా. ఒక ఎంపీ ఏం చేయ‌గ‌ల‌డో..ఎంత చేయ‌గ‌ల‌డో చేఇ చూపిస్తా` అని ఫేస్‌బుఖ్ లైవ్‌లో నాగ‌బాబు ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *