జబర్దస్త్ షో నుండి బయటకు రావడానికి కారణాలివే…

Nagababu Comes Out Of The Jabardast Show
బుల్లితెర మెగా కామెడీ షో జబర్దస్త్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. పంచ్ డైలాగ్స్, జడ్జీల సరదా సరదా మాటలతో షోకు ఎంతగానో పాపులారిటీ పెరిగింది. అయితే కొద్దీ రోజులుగా ఈ కామెడీ షో గురించి చర్చ జరుగుతుంది. జడ్జిగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు ఈ షో నుండి తప్పుకోనున్నాడని, అయితే అతను తప్పుకోవడాని కారణాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. మరి ఇదే విషయంపై స్పందించాడు నాగబాబు. వివరాలలోకి వెళితే…
తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్. ఈ షోకి నాగబాబు, నటి రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు యాంకర్స్ అనసూయ, రష్మీ తమదైన అందచందాలతో షోకి మరింత హంగులు తీసుకొస్తున్నారు. ఇక హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర..గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ తదితరులు షోకి మరింత హైప్ తీసుకొచ్చారు. అయితే ఇప్పటివరకు బాగున్నప్పటికీ గత కొంతకాలంగా జబర్దస్త్ షో పై కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అదేమంటే…జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకుంటున్నాడని, అయితే అతను తప్పుకోవడానికి ఇవే రీజన్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు దీనిపై నాగబాబు ఓ వీడియో రూపంలో స్పందించాడు.
ఇంతకీ నాగబాబు ఏమన్నాడంటే… జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటున్న మాట వాస్తవమే కానీ అందరు అనుకుంటున్నకారణాలు కావని, కేవలం బిజినెస్ పరంగా ఐడియాలజీ వల్లే తప్పుకొన్నానని నాగబాబు స్పష్టం చేశాడు. ఇక రెమ్యూనరేషన్ కారణంగానే నేను బయటకు వస్తున్నానని ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు. అయితే నాకిచ్చే రెమ్యూనరేషన్ బాగానే ఉన్నప్పటికీ అది నా  స్థాయికి చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. ఇక కేవలం బిజినెస్ పరమైన ఐడియాలజీ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు నాగబాబు. అదేవిదంగా… ఈ షోలో ఏడున్నర సంవత్సరాలు కొనసాగడమంటే మామూలు విషయం కాదని, ఇది ఒక రికార్డు అని నాగబాబు అన్నారు. ఈ విషయంలో ఈటీవీ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు. అంతే కాకుండా శ్యామ్ ప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఇక నా జర్నీ2013 ఫిబ్రవరి నుంచి 2019 నవంబర్ వరకు జరిగిందని,  ఇది నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం అంటూ తన ఫీలింగ్స్ ని గుర్తు చేసుకున్నారు. ఇక నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర, అదిరే అభి కూడా బయటికి వచ్చేశారు. ఇక అనసూయ ‘జబర్దస్త్’కు టాటా చెప్పేస్తారని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *