నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నాగబాబు

Spread the love

NAGABABU JOINED IN JANASENA

  • జనసేనలో చేరిన మెగా బ్రదర్

ఊహించినట్టుగానే మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో చేరారు. తన తమ్ముడు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాగబాబును పోటీలోకి దింపుతున్నట్లు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా తనదైన జీవితం గడుపుతున్న వ్యక్తిని తాను స్వయంగా పార్టీకి రావాల్సిందిగా ఆహ్వానించానని పవన్‌ వెల్లడించారు. తనలో రాజకీయ చైతన్యం మొదలైంది తన సోదరుడు నాగబాబు వల్లేనని చెప్పారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నాగబాబు అని చెప్పారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఆయన విజయం సాధిస్తారనే నమ్మకం తనలో ఉందన్నారు.  టికెట్‌ ఇచ్చినందుకు సోదరుడు పవన్‌కు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నాగబాబు రంగ ప్రవేశంతో నరసాపురం ఎంపీ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే టీడీపీ తరఫున శివ రామరాజు బరిలో ఉండగా.. వైఎస్సార్ సీపీ నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజును పోటీలో ఉన్నారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *