మనవడితో ఆడుకోవద్దా.. బాబుకు విశ్రాంతినిద్దాం

NAGABABU NEW VIDEO ON CBN

  • టీడీపీ అధినేతపై నాగబాబు వ్యంగ్యాత్మక వీడియో
  • ఆయన్ను ఇప్పటివరకు కష్టపెట్టింది చాలని సెటైర్లు

నా ఛానల్ నా ఇష్టం యూట్యూబ్ ఛానల్ తో చెలరేగిపోతున్న మెగా బ్రదర్ నాగబాబు మరో కొత్త వీడియో సంధించారు. జనసేనకు మద్దతుగా టీడీపీ, వైఎస్సార్ సీపీలపై సెటైర్లతో వీడియోలు చేస్తున్న నాగబాబు.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంలో కొత్త వీడియో చేశారు. ఇప్పటివరకు ఆయన్ను కష్టపెట్టింది చాలని.. ఇకనైనా బాబుకు విశ్రాంతినివ్వాల్సిందేనని పేర్కొన్నారు. ‘ఈసారి మా చంద్రబాబుకు మేం విశ్రాంతి ఇచ్చే తీరతాం. మనవడు దేవాన్ష్ తో ఆడుకునే అవకాశం కల్పిస్తాం. అందరూ హాయిగా విశ్రాంతి తీసుకోవాలి కానీ చంద్రబాబు మాత్రం పగలు రేయి తేడాలేకుండా కష్టపడాలి! ఇదేమన్నా న్యాయంగా ఉందా! ఈ వయసులో మనవడితో ఆడుకోవాలని ఆయనకు మాత్రం ఉండదా ఏంటి? 70 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుపై ప్రజలకు జాలి దయా లేవా? ఉంటే ఆయన్ని ఎందుకిలా కష్టపెడతారు? మళ్లీ మా చంద్రబాబే రావాలి అంటూ ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడతారు? ఈమధ్యే లోకేశ్ ఓ మాటన్నాడు. 70 ఏళ్ల వయసులో కూడా మా నాన్న చాలా కష్టపడుతున్నాడని అన్నాడు. ఒక కొడుకుగా లోకేశ్ బాధపడడంలో తప్పులేదు. అందుకే మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారికి విశ్రాంతి ఇస్తాం. తాత దగ్గర ఎలా ఆడుకోవాలో దేవాన్ష్ కూడా తెలుసుకోవాలి కదా’ అని వ్యంగ్య వ్యాఖ్యలు సంధించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బాబుకి విశ్రాంతినిచ్చే తీరతామని స్పష్టంచేశారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *