అఖిల్‌ని .. తార‌క్ ద‌గ్గ‌ర ఏం నేర్చుకోవాలో చెప్పిన నాగ్‌

Nagarguna said to akhil, what to learn from JR NTR

మిస్ట‌ర్ మ‌జ్ను ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చిన తార‌క్‌ను పెద్ద పెద్దబ్బాయిగా పిలిచిన నాగార్జున. త‌న ద‌గ్గ‌ర న‌ట‌న‌, మాస్ ఎలిమెంట్స్‌ను అఖిల్ నేర్చుకోవాలని అఖిల్‌కు స్టేజ్‌పైనే చెప్పాడు. త‌న‌ను తార‌క్ బాబాయ్ అని పిలుస్తాడు.. అలా అన్న‌ప్పుడ‌ల్లా త‌న‌కెంతో ఆనందంగా ఉంటుంద‌ని నాగ్ అన్నారు. బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ 25వ సినిమాగా `మిస్ట‌ర్ మ‌జ్ను` నిర్మించ‌డం చాలా ఆనందంగా ఉంది. `తొలిప్రేమ` చూశాను. లవ్‌స్టోరీకి ఏ అంశాలు కావాలో వెంకీ బాగా తెలుసు. నవ్వించడం, ఏడిపించడం, ప్రేమించడం వెంకీకి తెలుసు. పాటలు బావున్నాయి. కొన్ని సీన్స్‌ చూశాను. చాలా బావున్నాయి. నాన్న‌గారు, నేను మ‌జ్ను టైటిల్‌తో చేసిన సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆ రెండు సినిమాల్లాగానే ఈ మిస్ట‌ర్ మ‌జ్ను కూడా పెద్ద హిట్ కావాలని నాగ్ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *