నాగార్జున ఇమేజ్ దెబ్బ‌తింటుందా?

Spread the love

Nagarjuna May loose Image with BigBoss 3
అప్పుడెప్పుడో నాగ్ ఓ మాట‌న్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి! ప‌క్కింటో కాపురం చేస్తుంటే తొంగి చూడ్డం ఎంత ఇదిగా ఉంటుందో, రియాలిటీ షోల కాన్సెప్ట్స్ కూడా అలానే ఉన్నాయంటూ దాదాపుగా బిగ్ బాస్ ని ఉద్దేశించే వ్యాఖ్య‌లు చేశారు నాగార్జున‌. స‌రే… ఇప్పుడు అదే బిగ్ బాస్ సీజ‌న్ 3కి ఆయ‌నే హోస్ట్ గా మారాడు. వ్యాఖ్య వ్య‌క్తిగ‌తం, హోస్టింగ్ వ్యాపారం అనుకుందాం! ఇప్పుడీ బిగ్ బాస్ 3 చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. త్వ‌ర‌లో ఈ షో మొద‌లు కావాల్సి ఉంటే… ఈ షో ఆపేయాల‌నీ, లేదంటే రాత్రి 11 త‌రువాత ప్ర‌సారం చేసుకోవాల‌నీ, ప్ర‌తీ ఎపిసోడ్ ని ముందుగా సెన్సార్ చేయించాక‌నే ప్ర‌సారం చేయాలంటూ పిటీష‌న‌ర్లు కోర్టును ఆశించిన సంగ‌తి తెలిసిందే.

దీంతో దిక్కుతోచ‌ని స్టార్ యాజ‌మాన్యం కూడా కోర్టునే ఆశ్ర‌యించింది. బిగ్ బాస్ సీజ‌న్ 3 మీద దాఖ‌లైన పిటీష‌న్ల‌ను కొట్టేయాల‌నీ, పిటీష‌న‌ర్లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ అర్థర‌హిత‌మ‌ని నిర్వాహ‌కులు కూడా వాద‌న‌కు దిగుతున్నారు. ఈ నేప‌థ్యంలో అనుకున్న షెడ్యూల్ ప్ర‌కార‌మే జులై 21 నుంచి బిగ్ బాస్ ప్రారంభం అవుతుందా లేదా సందిగ్ధం యాజ‌మాన్యంలోనూ ఉంది. ఇక‌, అక్కినేని నాగార్జున విష‌యానికొస్తే… హాయిగా సాఫీగా సాగిపోతున్న కెరీర్లో, ఇప్పుడు ఈ షో పేరుతో అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌ల్ని కొని తెచ్చుకున్న‌ట్ట‌యింద‌ని అభిమానులు అంటున్నారు. ప్రారంభానికి ముందే కాస్టింగ్ కౌచ్ అనీ, లైంగిక వేధింపుల‌నీ చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలాంటి షో నాగ్ చేస్తే… ఆయ‌న‌పై నెగెటివ్ ప్ర‌చారం వ‌స్తుందేమో అనే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. క‌రెక్టే, కానీ ఇప్పుడు నాగ్ వెన‌క్కి త‌గ్గ‌లేరు క‌దా. విమ‌ర్శ‌లైతే కొన్ని త‌ప్ప‌క‌పోవ‌చ్చు, కానీ వాటిని త‌ట్టుకుని షో న‌డిపించే విధానంలో నాగ్ వ్య‌వ‌హ‌రించే తీరు వేరేలా ఉంటే, ఇవ‌న్నీ కొట్టుకుపోతాయి.

BIGBOSS 3 UPDATES

BIGBOSS 3 LATEST NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *