Nagarjuna Sagar and Srisailam dam prjoects gates open
కుండపోత వర్షాలతో తెలుగు రాష్ర్టాల్లోని ముఖ్య ప్రాజెక్టులు నిండుకుంటున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు గేట్లు ఎత్తేసి దిగువ ప్రాంతాలను నీటిని మళ్లిస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 63 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు దిగువన పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో వరద ఉధృతి పెరిగింది. జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న 4.35 లక్షల క్యూసెక్కులకు సుంకేశుల బ్యారేజీ నుంచి విడుదల చేసిన 77 వేల క్యూసెక్కుల తుంగభద్ర నదీ జలాలు కలుస్తుండటంతో.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,10,750 క్యూసెక్కులు చేరుతోంది. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం నాగార్జునసాగర్ లోకి 5,84,216 క్యూసెక్కులు చేరాయి.
శ్రీశైలంతో పాటు తెలంగాణలోని నాగార్జునసాగర్, డిండి ప్రాజెక్టులతో పాటు బోగత, మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ లకు జళకళ సంతరించుకుంది. దీంతో ప్రజలు జలపాతాలను చూసేందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్, శ్రీశైలం గేట్లు ఎత్తేయడంతో.. టూరిస్టులు వాటిని చూసేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా పీవీ సింధు కూడా నాగార్జున సాగర్ ను సందర్శించి తన్మయత్వం పొందారు.