నాగార్జునసాగర్‌ ఉప​ఎన్నిక

3

నాగర్జునసాగర్‌ ఉపఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. కాసేపట్లో భగత్‌కు సీఎం కేసీఆర్‌ బీఫామ్‌ అందజేయనున్నారు. రేపు ఉదయం భగత్‌‌ తన నామినేషన్ను దాఖలుచేయనున్నారు. కాగా నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్ సిట్టింగ్) గత ఏడాది డిసెంబర్‌లో ఆకస్మికంగా మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని నిలబెట్టింది. ఇక బీజేపీ అభ్యర్థిగా నివేదితా రెడ్డి బరిలో నిల్వనున్నట్లు సమాచారం. సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక

నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.

ఈనెల 31 న నామినేషన్ల పరిశీలన.

ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు

ఏప్రిల్‌ 17 న నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌

మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి.