షాకింగ్ లుక్ లో నాగ శౌర్య  

1
Nagasourya shocking look
Nagasourya shocking look

Nagasourya shocking look

నిన్నా మొన్నటి వరకూ చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో కనిపించాడు నాగశౌర్య. అదే ఇమేజ్ తో కంటిన్యూ అయితే కెరీర్ నర్తనశాల అవుతుందనుకున్నాడేమో.. సడెన్ గా సరికొత్త మేకోవర్ తో షాక్ ఇచ్చాడు. శౌర్య నుంచి ఇలాంటి లుక్ ను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. అందుకే చాలామంది అతని స్టిల్ చూసి షాక్ అవుతున్నారనే చెప్పాలి. కొన్నాళ్ల క్రితం కరోనా వచ్చిన టైమ్ లో అతను ఎక్కువగా ఫామ్ హౌస్ లోనే ఉంటూ బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ అది ఈ రేంజ్ లో ఉంటుందని చూస్తే కానీ తెలియలేదు. అన్నట్టు ఈ లుక్ అతని పర్సనల్ ఇంట్రెస్ట్ తో మాత్రమే కాదు.. ఓ సినిమా కోసం మార్చాడు. అంటే ఈ సారి సినిమా మాస్ కా బాప్ అనేలా ఉంటుందని అతని బాడీ చూస్తే తెలియడం లేదూ. హ్యాండ్సమ్ లుక్ తో పాటు ఆకట్టుకునే నటన చూపించగల ప్రతిభావంతుడు నాగశౌర్య. కానీ అందుకు తగ్గ రేంజ్ లో విజయాలు రావడం లేదు.

కెరీర్ లో ఇప్పటి వరకూ ఊహలు గుసగుసలాడే, ఛలో తప్ప పెద్ద విజయాలు లేవు. అయినా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇంతకు ముందు సుమంత్ తో ‘సుబ్రహ్మణ్య పురం’అనే సినిమా చేసిన ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలోనిదే ఈ లుక్. ఏసియన్ ఫిల్మ్స్ సునిల్ నారంగ్ నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఇక ఈ సినిమా ఓ ఆర్చర్(విలుకాడు)కథ. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఆర్చరీలో అనేక ఒడిదుడుకులు ఫేస్ చేసి చివరికి అనుకున్నది సాధించిన ఓ కుర్రాడి కథట. అంటే ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నమాట. ఏదేమైనా ఈ మూవీ ప్రీ లుక్ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ నెల 27న మూవీ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తారట. మరి ఫస్ట్ లుక్ మాత్రమేనా లేక టైటిల్, హీరోయిన్ వంటి అంశాలు కూడా విడుదల చేస్తారా అనేది చూడాలి.

tollywood news