బాలయ్య నర్తనశాల

Nandamuri balakrishna Narthanashala

హీరో బాలయ్య బాబు ఏం చేసినా సపరేటు స్టయిల్ ఉంటుంది. క్లాస్, మాస్, ఫ్యామిలీ జోన్లతో పాటు సాంఘిక, జానపద చిత్రాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. గతంలో ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా దసరా సందర్భంగా అక్టోబర్‌ 24న విడుదల చేయాలని నిర్ణయించారు. మంగళవారం అర్జునుడి పాత్రలో ఉన్న నందమూరి బాలకృష్ణ లుక్‌ను సినిమా ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. దీని ద్వారా వచ్చే ఆదాయం బసవతారకం క్యానర్స్ హాస్పటల్ వినియోగించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *