బాలయ్య రూలర్ టీజర్….

nandamuri balakrishna ruler official teaser

నందమూరి సింహం మరోసారి గర్జించింది. అవును రూలర్ గా వస్తున్న బాలయ్య మరోసారి అభిమానులకు తీపి కబురు అందించనున్నారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ సినిమా రూలర్ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. అయితే నేడు ఈ చిత్ర టీజర్ రిలీజై నందమూరి అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. మరి ఒకసారి రూలర్ టీజర్ ఎలా ఉందొ ఒకసారి చూసేద్దాం పదండి.

నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం రూలర్. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు గెటప్పుల్లో అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జై సింహా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇక మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతుంది. రూలర్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్.. పోస్టర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీజర్‌తో వచ్చాడు నందమూరి హీరో బాలయ్య . ఈ టీజర్లో బాలయ్య మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ముఖ్యంగా టీజర్లో బాలయ్య విశ్వరూపం చూపించాడు. ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోన్‌లో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బయటికొచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే..’’ అంటూ సాగే పవర్ ఫుల్ డైలాగ్ తో బాలయ్య టీజర్ ని నింపేశాడు. ఈ ఒక్క డైలాగ్ నందమూరి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు షేడ్స్ లో కనిపించనున్నారు. వాటిలో ఒక పాత్ర చాలా స్టైలిష్‌గా ఉండగా… మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *