కేశినేని నానీ పోస్ట్ కలకలం.. భయం నా రక్తంలో లేదన్న నానీ

Spread the love
Nani fear is not in my blood

ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు దుమారంగా మారాయి . ఫేస్బుక్ వేదికగా సంచలనాలకు తెర తీసిన కేశినేని నాని మొన్నటికి మొన్న పెట్టిన పోస్ట్ తో అటు కొడాలి నానికి, దేవినేని కి మధ్య ఉన్న పాత ఘర్షణలను గుర్తు చేసి టీడీపీలో కలకలం రేపారు. మంత్రిగా అవకాశం వచ్చినందుకు కొడాలి నానీ దేవినేనికి కృతజ్ఞతలు తెలపాలని ఆయన పేర్కొన్నారు. దీంతో అది పెద్ద చర్చకు కారణం అయ్యింది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి పెద్ద తలనొప్పిగా తయారైన కేశినేని నాని టీడీపీలో కొనసాగుతూనే సంచలన వ్యాఖ్యలు చేయడం తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.

టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ వేదికగా మరో సంచలన పోస్ట్ పెట్టారు తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వ్యక్తిని కానని ,తన వ్యక్తిత్వం అలాంటిది కాదని కేశినేని నాని కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ చూస్తే “నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు” అని పేర్కొన్నారు.

ఇక ఇందులో తాను ఎవరికీ భయపడని, భయంతో తన రక్తంలో లేదని పేర్కొన్న కేశినేని నాని రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాను అంటూ , నిండు సభలో మోడీని నిలదీసినవాడిని అంటూ పేర్కొన్నారు. టిడిపి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కేశినేని నాని ఇంకా చల్లబడలేదు. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ బేఖాతరు చేస్తూ కేశినేని నాని తన పంథాను వీడలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *