నానిని మెప్పించిన ఏజెంట్

15
nani movie
nani movie

nani new movie

నేచురల్ స్టార్ గా ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ నాని. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఈ మధ్య కాలంలో అతను  చేసిన ప్రయోగాలన్నీ బెడిసికొట్టాయి. గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ అనిపించుకుంది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘వి’సైతం మెప్పించలేకపోయింది. దీంతో ఇకపై తన ఇమేజ్ ను దాటి ఎక్స్ పర్మెంట్స్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల కథల్లోనూ మళ్లీ కొన్ని మార్పులు జరిగాయని వినిపించింది. ప్రస్తుతం నాని చేతిలో మూడు సినిమాలున్నాయి. వీటిలో టక్ జగదీష్ షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. నాని హీరోగా నిన్నుకోరి సినిమాతో పరిచయం అయిన శివ నిర్వాణ రూపొందిస్తోన్న సినిమా ఇది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేయబోతున్నారు. అక్టోబర్ 3నుంచి నాని టక్ జగదీష్ షూటింగ్ లోజాయిన్ కాబోతున్నాడు. ఈ యేడాది చివరి వరకూ ఈ మూవీ పూర్తయ్యే వరకూ నాన్ స్టాప్ గా షూటింగ్ చేయబోతున్నారు. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్, మెంటల్ మదిలో బ్రోచెవారెవరుగా ఫేమ్ వివేక్ ఆత్రేయలతో సినిమాలున్నాయి.

ఇవి రెండూ 2021లో స్టార్ట్ అవుతాయి. ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటాయి. అయితే వీటితో పాటు నాని లేటెస్ట్ గా మరో మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో దర్శకుడుగా తనదైన ముద్ర వేసిన స్వరూప్ ఆర్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. యస్.. ఏజెంట్ డైరెక్టర్ చెప్పిన కథకు నాని చాలా ఇంప్రెస్ అయ్యాడట. వెంటనే సైన్ చేశాడంటున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మింబోతోన్న ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది. ఏదేమైనా ఫ్లాపులతో పనిలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడీ నేచురల్ స్టార్.

tollywood news