నాన్ స్టాప్ గా నాని

2
nani non stop
nani non stop

nani non stop

కరోనా గొడవ నుంచి అన్ని పరిశ్రమలూ మెల్లగా తేరుకుంటున్నాయి. హీరోలు కూడా షూటింగ్స్ కు రావడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఆల్రెడీ కొన్ని చిన్న సినిమాలు కరోనా తర్వాతే తమ చివరి షెడ్యూల్స్ ను ఫినిష్ చేసుకుని గుమ్మడికాయ కొట్టేసుకున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా కుంటాల జలపాతం వద్ద కొన్ని సీన్స్ చిత్రీకరణలో పాల్గొన్నాడు అనే టాక్స్ వచ్చాయి. ఇటు మెగాస్టార్ నవంబర్ నుంచి రాబోతున్నాడు. అలాగే ఆర్ఆర్ఆర్ కూడా నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. దీంతో యంగ్ స్టర్స్ కూడా ఇక రంగంలోకి దిగబోతున్నారు. అయితే వీరికి డిఫరెంట్ గా నాని మరో కొత్త స్టెప్ తీసుకుంటున్నాడు. అందుకు కారణం అతని చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉండటమే. నాని 25వ సినిమాగా వచ్చిన వి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. కానీ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. ఆ డిజప్పాయింట్మెంట్ నుంచి త్వరగానే కోలుకున్నాడు. అందుకే గతంలోనే స్టార్ట్ అయిన టక్ జగదీష్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు నాని. అయితే ఈ సినిమా ఇప్పటికే సగం వరకూ పూర్తయింది.

అందుకే టక్ జగదీష్ పూర్తయ్యేంత వరకూ మరో సినిమా కు వెళ్లకుండా పూర్తి టైమ్ జగదీష్ కే కేటాయించాలనుకుంటున్నాడట. ఈ మేరకు షూటింగ్ షెడ్యూల్స్ కూడా రెడీ అయ్యాయని టాక్. నిన్నుకోరి, మజిలీ చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. పూర్తిగా నాని ఇమేజ్ కు అనుగుణంగానే కథ, కథనాలు ఉంటాయట. మరోవైపు నాని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ‘శ్యామ్ సింగ్ రాయ్’చేస్తున్నాడు. దీంతో పాటు మరో కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తంగా కన్ఫ్యూజన్ లేకుండా ముందుగా టక్ జగదీష్ ను ఫినిష్ చేసి ఆ తర్వాతే మరో ప్రాజెక్ట్ లోకి వెళ్లాలనుకుంటున్నాడట. దీని వల్ల సినిమాల మధ్య పెద్దగా గ్యాప్ కనిపించదు. పైగా కాల్సీట్స్ కూ ఇబ్బంది ఉండదు. అందుకే సరికొత్త ప్లానింగ్ తో వచ్చే నెల నుంచి టక్ జగదీష్ రెగ్యులర్ షూట్ లో జాయిన్ అవుతున్నాడట నాని.

tollywood news