ఉల్లి ధరలపై , హెరిటేజ్ రగడపై భువనేశ్వరి ఏమన్నారంటే

Nara Bhuvaneswari About Heritage Fresh

ఏపీలో ఉల్లిపై రగడ కొనసాగుతుంది. నిన్న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉల్లి కొరతపై, అలాగే విపరీతంగా పెరిగిన ఉల్లి  ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైన విధానంపై  లొల్లి కొనసాగింది. ఉల్లి కొరత మరియు ధరలపై అసెంబ్లీలో టీడీపీ ఆందోళన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వాటి ధరలను ప్రస్తావిస్తూ హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.200లకు అమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో  హెరిటేజ్ పై దుమారం రేగింది. ఇక దానికి సమాధానం గా చంద్రబాబు హెరిటేజ్ మాదికాదని చెప్పడం, ఓ మంత్రి తనకు గిఫ్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించడం జరిగాయి. దీనిపై వివరణ ఇచ్చిన చంద్రబాబు హెరిటేజ్ ఫ్రెష్‌ మాది కాదని హెరిటేజ్ ఫుడ్స్ తమదని అదికూడా తెలియకుండా విమర్శలు ఏంటని ప్రశ్నించారు.

ఇక హెరిటేజ్ పై అసెంబ్లీ వేదికగా రచ్చ  నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు నారా భువనేశ్వరి. ఉల్లిధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో ఉల్లి ధరలు ఇంత భారీగా పెరగడం ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి ధరలు తగ్గించేందుకు కృషి చేయాలని భువనేశ్వరి కోరారు. ఇదే సమయంలో హెరిటేజ్‌ ఫ్రెష్ లో ఉల్లి ధరలతో మాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు నారా భువనేశ్వరి. హెరిటేజ్ ఫ్యూచర్ గ్రూప్స్ వాళ్లదని ఆమె పేర్కొన్నారు. హెరిటేజ్ ఫ్రెష్ తమ అధీనంలో లేదని, హెరిటేజ్ ఫ్రెష్ తమకు ఎలాంటి సంబంధమూ లేదని  భువనేశ్వరి పేర్కొన్నారు.

tags : onion price raise, heritage, ap assembly session, chandrababu, jagan , bhuvaneshwari, ntr trust bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *