జగన్ గారూ! శవాల మీద రాజకీయాలా?

nara lokesh attacked cm jagan

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య పట్ల నారా లోకేష్ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. శవాల మీద రాజకీయ లబ్ది కాసులు ఏరుకునే పైశాచిక చేష్టలను వైసీపీ ఎప్పటికీ మానుకోదా అని ప్రశ్నించారు. కోడెలను కేసుల పేరుతో వేధించి ఆయన బలవన్మరణానికి కారణమైనందుకు కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా, సిగ్గులేని ప్రచారాలతో రెచ్చిపోతారా? అంటూ నిలదీశారు. మీరసలు మనుషులేనా? మీకసలు విలువలనేవే లేవా? అంటూ ప్రశ్నించారు.  కోడెల ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ వైకాపా ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా? అంటూ నిలదీశారు.  కోడెల కొడుకు విదేశాల్లో ఉంటే..  మీ గుడ్డి సాక్షి ఛానల్ కి కనపడలేదా అని ప్రశ్నించారు.

ఇది ఇలా ఉండగా.. రేపు ఉదయం 8 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నరసరావు పేట కు కోడెల శివ ప్రసాద రావు భౌతిక ఖాయం తరలిస్తారని సమాచారం.

ap political updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *