గురితప్పని ‘బాణం’తో వస్తున్న రోహిత్

2
Nara Rohit new movie
Nara Rohit new movie

Nara Rohit new movie

తెలుగులో వైవిధ్యమైన సినిమాలు చేసే హీరోలు అతి తక్కువగా ఉన్నారు. అందులోనూ ఎక్కువ సినిమాలు చేసిన హీరో నారా రోహిత్.. పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వెండితెర వైపు బాణంలా దూసుకువచ్చిన రోహిత్ ఇలాంటి కథలకు ప్రతినిధిలా మారాడు. కాకపోతే పూర్తిగా అవి మాత్రమే చేయడంతో ఓ దశలో విజయాలు మొహం చాటేశాయి. దీంతో కొన్నాళ్లుగా లాంగ్ లీవ్ లో ఉన్నాడు. లేట్ అయినా లేటెస్ట్ గా అంటూ మరింత దూకుడుగా రాబోతున్నాడట రోహిత్. ఈ సారి ఓ పీరియాడిక్ మూవీతో వస్తున్నాట్ట రోహిత్. తొలి సినిమా సక్సెస్ అయినా కాకపోయినా.. ఆ హీరోకు మంచి మార్కులు రావడం అరుదు. అలాంటి అరుదైన ప్రశంసలే అందుకున్నాడు నారా రోహిత్. బాణం మూవీలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మంచి వాయిస్ కూడా అతనికి ప్లస్ అయింది. అందుకే బాణం ఆశించినంత పెద్ద విజయం సాధించకపోయినా.. తర్వాత సోలోగానే తన జర్నీ కంటిన్యూ చేశాడు. వైవిధ్యమైన కథలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకోవడంలో చాలా తక్కువ టైమ్ లోనే సక్సెస్ అయ్యాడు. రోహిత్ ఎంచుకున్న కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తగానే అనిపించాయి. అందుకే అతనికి ప్రత్యేకమైన అభిమానులు కూడా ఏర్పడ్డారు. అలాగే రౌడీ ఫెలో లాంటి కమర్షియల్ సినిమాలతోనూ ఆకట్టుకున్నాడు రోహిత్.

ఇక తనలాగే ఆలోచించే మరో మిత్రుడు శ్రీ విష్ణుతో కలిసి నిర్మాణమూ మొదలుపెట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు అద్భుతమైన రివ్యూస్ తెచ్చుకుంది. కొన్నాళ్ల క్రితం అతని చేతిలో అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. కానీ వరుస ఫ్లాప్ లు వస్తుండటంతో అన్నిటినీ హోల్డ్ లో పెట్టేసి కొంత కాలంగా పూర్తిగా కథలు వినేందుకే కేటాయించాడు. ఇక ఎన్నాళ్లుగానో అనుకుంటోన్న బాణం కాంబినేషన్ ఫైనల్ సెట్ అయింది. బాణం దర్శకుడు చైతన్య దంతులూరితో రోహిత్ కొత్త సినిమా చేయబోతున్నాడు. 1971లో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. అయితే రోహిత్ సైనికుడుగా కనిపిస్తాడా లేక ఆ నేపథ్యంలో సాగే కథలో హీరోగా కనిపిస్తాడా అనేది చూడాలి. అలాగే ఈ చిత్రం ఇప్పటి వరకూ రోహిత్ కెరీర్ లో లేనంత పెద్ద బడ్జెట్ లో రూపొందబోతోందట. ఒకప్పుడైతే హీరో ఇమేజ్, మార్కెట్ వాల్యూ చూసి బడ్జెట్ లెక్కలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు కంటెంట్ లో యూనిక్ అప్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది. అందుకే రోహిత్ ముందడుగు వేయబోతున్నాడట. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాబోతున్నాయి. మరి ఈ మూవీతో రోహిత్ మళ్లీ బిజీ అవుతాడేమో చూడాలి.

tollywood news