మా అధ్యక్షుడిగా నరేశ్

NARESH ELECTED AS MAA PRESIDENT

  • ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్
  • వైస్ ప్రెసిడెంట్లుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ

ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. సాధారణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేశ్ మా కొత్త అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రత్యర్థి శివాజీ రాజాపై ఆయన గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌పై రాజశేఖర్ గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జనరల్ సెక్రటరిగా రఘుబాబుపై జీవిత రాజశేఖర్ గెలుపొందారు. జాయింట్  సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించారు. ట్రెజరర్‌గా కోట శంకర్రావుపై  రాజీవ్ కనకాల గెలుపొందారు. ఈసీ సభ్యులుగా అలీ, రవిప్రకాష్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేష్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ‘మా’లో మొత్తం 745మంది సభ్యులు ఉండగా.. 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఫలితాలు విడుదలయ్యాయి.

TELUGU CINEMA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *