మ‌హేష్‌ను క‌లిసి న‌రేష్ ప్యానెల్‌

Naresh Pannel Meet Mahes Babu
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)లో ఎన్నిక‌ల వేడి రాజుకుంటుంది. శివాజీ రాజాకు వ్య‌తిరేకంగా న‌రేష్ ప్యానెల్ పోటీ చేస్తుంది. ఇందులో రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌లు కూడా ఇత‌ర ప‌ద‌వుల‌కు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల కోసం న‌రేష్ ప్యానెల్‌, అప్పుడే ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టేసిన‌ట్లు ఉంది. ఎందుకంటే ఈ వ‌ర్గం స‌భ్యులు న‌రేష్‌, జీవిత‌,రాజ‌శేఖ‌ర్ ఈరోజు మ‌హేష్‌ను ప్ర‌త్యేకంగా క‌లిశారు. త‌మ ప్యానెల్‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు. “నేను, రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌లు మ‌హేష్‌బాబును క‌లిసి మా ప్యానెల్‌కు స‌పోర్ట్ చేయాల్సిందిగా కోరాను. మార్చి 10న జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఓటు వేస్తాన‌ని మహేష్ వేస్తాన‌ని అన్నారు“ అని తెలిపారు న‌రేష్.

For More Interesting Updates Tsnews.tv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *