నాయిని భార్య అహల్య కన్నుమూత

Nayani Wife Dead

కరోనా పాజిటివ్ రావటంతో నాయిని నర్సింహ రెడ్డి తో పాటే అహల్య ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. కరోనా నెగటివ్ వచ్చినా వూపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందారు. భర్త నాయిని నర్సింహ రెడ్డి మృతి తో ఆఖరి చూపుకు అహల్య ను అంబులెన్స్ లో కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. మాజీ హోం మంత్రి, స్వర్గీయ నాయిని నర్సింహరెడ్డి గారి సతీమణి శ్రీమతి అహల్య గారి మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శానససభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. కరోనాను జయించినా ఇతర అనారోగ్య సమస్యలతో శ్రీమతి అహల్య మరణించడం బాధాకరం, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య మృతి చెందారని విషయం తెలుసుకొని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

#Nayani Wife Expired News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *