నయనతార సినిమాలో సమంత

Nayanthara and Samantha set to Vijay Sethupathi

సమంత.. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా తెలుగుతో పాటు తమిళ్ లోనూ ప్రూవ్ చేసుకుంది. పెళ్లి తర్వాత ‘దూకుడు’ తగ్గించినా సెలెక్టెడ్ మూవీస్ తో సత్తా చాటుతోంది. లేటెస్ట్ గా వచ్చిన జాను కమర్షియల్ సక్సెస్ మేటర్ ఎలా ఉన్నా.. సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక లాస్ట్ ఇయర్ ‘ఓ బేబీ’తోనూ సూపర్ స్కోర్ చేసింది. మొత్తంగా తన మనసుకు నచ్చితేనే సినిమా చేస్తా అంటూ సెటిల్డ్ గా ఉన్న శామ్ కు జాను తర్వాత సినిమాలు రావేమో అనుకున్నారు చాలామంది. బట్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ తను మరో ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. కాకపోతే ఇది తమిళ్ మూవీ.

తమిళ్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి సినిమాలో సమంత నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్ గా నయనతార నటిస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీ కొన్నాళ్ల క్రితం వచ్చిన నానుమ్ రౌడీదాన్ కు సీక్వెల్ అంటున్నారు. ఈ మూవీతో దర్శకుడుగా పరిచయం అయిన విఘ్నేష్ శివన్ తోనే నయన్ ప్రస్తుతం ప్రేమలో ఉంది. మరోసారి ఈ రౌడీ బ్యాచ్ కలిసి తీస్తోన్న సినిమాలో శామ్ జాయిన్ కావడం విశేషం.

ఇక ఇంతకు ముందు విజయ్ సేతుపతి నటించిన‘సూపర్ డీలక్స్’లో ఓ కీలక పాత్రలో అదరగొట్టింది సమంత. కాకపోతే విజయ్ కి పెయిర్ కాదు. ఇక ఫ్యామిలీ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో శామ్ అండ్ నయన్ పాత్రలు ఎలా ఉంటాయో కానీ..  ‘కాతువలకుల రెండు కాదల్’పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Nayanthara and Samantha set to Vijay Sethupathi,Samantha Akkineni,#Nayanthara,Vignsh Sivan,Tollywood News,Tamil Movies Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *