కొత్త బిజినెస్ లోకి ప్రభాస్ ఫ్రెండ్స్

new business of prabhas friends

కొన్ని వార్తలు వింటున్నప్పుడే తెలిసిపోతుంటాయి. ఇది అయ్యే పనేనా అని. అలాగని వార్తలు వచ్చే సంస్థనో లేక స్టార్ నో బట్టి.. అంత సులువుగానూ కొట్టి పారేయలేం. ఇలాంటి ఓ వార్తే ఇప్పుడు టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు ముందుకు వస్తోందట. అందుకోసం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ తో పాటు యంగ్ స్టర్స్ ను కూడా కథలు రెడీ చేయమని చెబుతోందట. మరి ఈ సంస్థ సొంతంగా ఓటిటి ప్లాట్ ఫామ్ సిద్ధం చేస్తోందా లేక.. ఇంకేదైనా రీజన్ ఉందా..?  అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటిగా నిలిచింది యూవీ క్రియేషన్స్ బ్యానర్ .. ఆ సంస్థకు త్వరగా క్రేజ్ రావడానికి మరో కారణం నిర్మాతలు ప్రభాస్ కు ఫ్రెండ్స్ కావడం.. వీరి తొలి సినిమా కూడా మిర్చి కావడం. మిర్చి నుంచి వరుస విజయాలతో దూసుకువచ్చారు. వరుసగా ఐదు విజయాలు అందుకున్నారు. వీటిలో అనుష్క నటించిన భాగమతి కూడా ఉంది.  అటు శర్వానంద్ నూ కొత్త ట్రాక్ ఎక్కించింది ఈ సంస్థే. మొత్తంగా సక్సెస్ రేట్ ప్రకారం చూస్తే స్ట్రాంగ్ గానే ఉందీ బ్యానర్ .

అయితే ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియన్ లెవల్లో నిర్మించిన సాహో ఇబ్బంది పెట్టడం యూవీ క్రియేషన్స్ కు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ తోనే మరో సినిమా చేస్తోందీ సంస్థ. ఇదే టైమ్ లో కొన్ని వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలనే ఆలోచనలో ఉందట. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ భారీగా నడుస్తోంది కదా.. ఆ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి ఎంటర్ కావాలని చూస్తోందట. అయితే ఈ స్టార్టింగ్ అద్భుతంగా ఉండాలంటే ఖచ్చితంగా భారీ కంటెంట్ తోనే రావాలి. అందుకోసం ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ను సంప్రదిస్తున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే పూరీ జగన్నాథ్ చాలా బిజీగా ఉన్నాడు. తర్వాత జనగణమన సినిమా కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో తమ బ్యానర్ లో సాహో తీసిన సుజిత్ ను సైతం మంచి కథలు రెడీ చేయాలని చెప్పారట. రాబోయే రోజుల్లో సౌత్ లోనూ ఈ ట్రెండ్ భారీగా విస్తరించబోతోందని ఇప్పటికే చాలామందికి అర్థమైంది. అందుకే చాలామంది ఈ ఓటిటి బిజినెస్ వైపు చూస్తున్నారు. మరి యూవీ క్రియేషన్స్ కూడా ఫ్యూచర్ ప్లాన్ లో భాగంగానే ఇలా చేస్తోంది అనుకోవచ్చు. ఏదేమైనా పూరీ జగన్నాథ్ మాత్రమే కాదు.. ఏ స్టార్ హీరో కూడా ఇప్పుడప్పుడే వెబ్ సిరీస్ ల వైపు వస్తారా అనేదే పెద్ద డౌట్.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *