New Corona Cases 684
రాష్ట్రంలో కొత్త 684 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 394 మంది కోలుకోగా ముగ్గురు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను క్షుణ్నంగా గమనిస్తే.. జీహెచ్ఎంసీలో దాదాపు 180 మందికి కొత్తగా కరోనా సోకింది. యాభై శాతం కేసులు యాభై ఏళ్లలోపు వారికే రావడం గమనార్హం. అమ్మాయిల్లో ముప్పయ్యేళ్ల లోపు వారికి సుమారు పదిహేను శాతం సోకింది. జీహెచ్ఎంసీ పరిధిలో.. మార్చి 24న 138 కేసులు నమోదైతే, తాజాగా 184 నమోదు కావడం కాస్త ఆందోళన కలిగించే విషయం. జీహెచ్ఎంసీ తర్వాత మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, జగిత్యాల వంటి జిల్లాల్లోనూ కరోనా కేసులు మళ్లీ నమోదు అవుతున్నాయి. కాకపోతే, కొవిడ్ వల్ల మరణాల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. 97.83 శాతం మంది కోలుకుంటున్నారు.