సరిలేరులో సీన్స్ కలుపుతున్నారంటగా?

New Dialogues In Sarileru
టైల్స్ ఏత్తన్నారంటగా అంటూ పోకిరి సినిమాలో మహేష్ బాబు, ఆశిష్ విద్యార్థిని ఉద్దేశిస్తూ చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్సో తెలుసు కదా.. ఇప్పుడు అలాంటి ఓ ఫేమస్ సీన్ ను సరిలేరు నీకెవ్వరు కోసం కలుపుతుున్నారట. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద గట్టిగానే కొట్టింది. కాకపోతే అల వైకుంఠపురములో సినిమాతో పోటీ విషయంలోనే ఇంకా ఎవరు గెలిచారు అనేదే తేలడం లేదు. అయితే లేటెస్ట్ గా అనిల్ రావిపూడి ఈ సినిమాలో మరికొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నట్టు చెప్పాడు.

మామూలుగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు సీన్స్ యాడ్ చేయడం చూస్తుంటాం. అలాగే అనుకున్నంత హైప్ రాని సినిమాలకు కూడా ఇదుగో సీన్స్ యాడ్ చేశాం.. ఇప్పుడు ఇంకా బావుంటుంది వెళ్లి మళ్లీ చూడండి అంటూ అదో తరహా ప్రమోషన్ కూడా చేస్తుంటారు. మరి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు టీమ్ ఈ రెండు అంశాల్లో ఏ టాపిక్ తో ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారో కానీ.. ఇప్పటికే ఓవర్శీస్ తో పాటు కొన్ని మల్టీప్లెక్సుల్లో సరిలేరు కాస్త వెనకబడి ఉంది. ఈ టైమ్ లో సీన్స్ యాడ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అవతలి  హీరో ఫ్యాన్స్  ఖచ్చితంగా రెండోదాన్నే ప్రచారం చేస్తారు. నిజానికి ఇప్పుడు సరిలేరుకు కొత్తగా కలిపే సీన్స్ వల్ల వచ్చే ఉపయోగం ఏం ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. పైగా అవి రావు రమేష్ తో ఉండే కేవలం ఒకటిన్నర నిమిషం సన్నివేశమట. మరి రావు రమేష్ కోసం మళ్లీ సినిమా ఎవరు చూస్తారు ఇప్పుడు. ఈ మాత్రం దానికి సీన్స్ యాడ్ చేశాం అనే మాట సినిమాకు మైనస్ అవుతుందే తప్ప కొత్తగా ఉపయోగం ఉండదు. అందుకే ఈ విషయంలో అనిల్ మళ్లీ ఆలోచించుకుంటే మంచిది.

#Sarileru Neekevvaru Latest Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *