New heroins for Ram charan
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కోసం కత్తి లాంటి హీరోయిన్లను సెట్ చేయబోతున్నారు. రంగస్థలం సినిమా నుంచి సరికొత్తగా ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటున్నాడు రామ్ చరణ్. మధ్యలో వినయ విధేయ రామ అంటూ ఓ డిజాస్టర్ ఉన్నా.. ఇకపై అలాంటి ‘మిస్టేక్స్’ జరగకుండా చూసుకోవాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో మగధీర తర్వాత మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీతో రాబోతున్నాడు రామ్ చరణ్. తనతో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇంటర్వెల్ బ్యాంగ్ పడ్డ సినిమాలా ఆగిపోయింది. అయితే మళ్లీ సెకండ్ హాఫ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియన పరిస్థితిలో ఉందీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వల్ల రామ్ చరణ్ మాత్రమే కాక ఎన్టీఆర్ కూడా లాక్ అయిపోయాడనే చెప్పాలి. అయితే రామ్ చరణ్ మాత్రం ఆల్టనేషన్ ముందే చూసుకున్నాడు. లాక్ డౌన్ తర్వాత తను వెంటనే ‘ఆచార్య’షూటింగ్ కు వెళ్లేలా ప్లాన్స్ వేసుకున్నాడు. ఇందుకు రాజమౌళి నుంచి కూడా ఆల్రెడీ పర్మిషన్ ఉంది. ఇక తనే నిర్మిస్తోన్న ఆచార్యలో మెగాస్టార్ మెయిన్ హీరో అయినా.. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ మూవీలో చరణ్ కు ఓ హీరోయిన్ కూడా ఉంది. తన కోసమే టీమ్ వేట మొదలైంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఇంతకు ముందే ఫిక్స్ అయింది. ఇక చరణ్ కోసం ప్రస్తుతం ఇద్దరు క్రేజీ బ్యూటీస్ ను తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే వీరిలో ఎవరో ఒకరు నటిస్తారన్నమాట. ఇంతకీ ఆ భామలెవరో తెలుసా.. చరణ్ తో ఆల్రెడీ వినయ విధేయ రామలో ఆకట్టుకున్న కియారా అద్వానీ.. అలాగే మహానటి కీర్తి సురేష్. ఈ ఇద్దరినీ సంప్రదిస్తున్నారట. అయితే కియారా ఇంతకు ముందు మహేష్ బాబుకు డేట్స్ ఇవ్వలేకపోయింది. మరి చరణ్ కు ఇస్తుందా అనేది డౌట్. అలాగే కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇలాంటి టైమ్ లో ఆ సినిమాలను కాదని కొత్తగా ఒప్పుకునే సినిమాకు డేట్స్ ఇస్తుందా అనేదీ అనుమానమే. అయితే ఈ ఇద్దరిలోనే ఒకరిని ఒప్పించాలనుకుంటోందట టీమ్. మరి చరణ్ తో రొమాన్స్ చేసే లక్ ఈ బ్యూటీస్ లో ఎవరికి వస్తుందో చూడాలి.