పురందరేశ్వరికి కొత్త చిక్కులు

Spread the love
New implications for Purandeswari

బీజేపీ మహిళా నేత పురందరేశ్వరికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె విశాఖపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు . అయితే… ఆమె అభ్యర్థిత్వంపై కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ తెలిపారు.
సోమవారం సచివాలయంలో సీఈవోను కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, ‘‘పురందేశ్వరి ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌గా ఉన్నారని ఆ పోస్టుకు రాజీనామా చేయకుండా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని సీఈవోకు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు . భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గత ఎన్నికల్లో తాను ఏమీ చదువుకోలేదని అఫిడవిట్‌లో రాశారు. ఈ ఎన్నికల్లో డిగ్రీ చదువుకున్నట్లు పేర్కొన్నారని ఆయన తెలిపారు . దీనిపై మార్చి 3నే ఫిర్యాదు చేశామన్న బీవీ రామ్ విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఈసీ, ఎన్నికలు పూర్తయిన తర్వాత తామేమీ చేయలేమని, కోర్టును ఆశ్రయించమని సూచించిందని పేర్కొన్నారు . పురందేశ్వరి, ముత్తంశెట్టితోపాటు ఈసీపైనా కోర్టుకెళ్తాం’ అని రామ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *