టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

New Zealand win toss, elect to field against India

మూడు వన్డేల సిరీ‌స్‌లో భాగంగా నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య నేడు తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ టామ్‌ లాథమ్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత కోహ్లీసేన ఆత్మవిశ్వాసం అంబరాన్ని చుంబిస్తుండగా.. అటు న్యూజిలాండ్‌ టీ20 గాయాలను మరచి కొత్తగా ఆటను మొదలు పెట్టాలని భావిస్తోంది. ఇక గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా కెప్టెన్ గా కోహ్లీ వ్యవహరించనున్నాడుటీ20 సిరీస్ ని 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ఆత్మవిశ్వాసం తో ఉన్న టీం ఇండియా నేడు జరిగే మొదటి మ్యాచ్ లో ఏ మేరకు రాణిస్తుందో వేచిచూద్దాం. టీమిండియా జట్టు ఇదే.. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శార్ధుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, బుమ్రా

New Zealand win toss, elect to field against India,Ind vs NZ, 1st ODI LIVE,Virat Kohli, Shreyas Iyer,Rohith Injured,India vs New Zealand live score 1st ODI at Hamilton

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *