ఎన్కౌంటర్ పై పోలీసులకు నోటీసులు

NHRC issues notices to Telangana police on encounter

దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై పోలీసులకు ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. ఇప్పుడు దేశం మొత్తం దీనిపైన చర్చిస్తుంది. మెజారిటీ ప్రజలు పోలీసు తీసుకున్న నిర్ణయాన్ని, అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను ఎన్కౌంటర్ చేయడాన్ని సమర్ధిస్తున్నారు. ఇక సినీ వర్గాలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వీరు వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఘటనపై తమ స్పందన తెలియ చేస్తున్నారు. ఇక ఈ ఎన్కౌంటర్ ఘటనను వ్యతిరేకిస్తున్న వారు సైతం లేకపోలేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్ప, ఎన్కౌంటర్ మరోటి కాదని పలువురు పేర్కొంటున్నారు. క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ పేరుతో పోలీసులు క్రైమ్ సీన్ కన్స్ట్రక్షన్ చేశారని మండిపడుతున్నారు. వాళ్లు దోషులుగా తెలియకుండా, ఎలాంటి విచారణ జరగకుండా వారిని ఎన్కౌంటర్ చేయడం, మన సంబరాలు జరుపుకోవడం ఏమిటి అని మానవ హక్కుల సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది.

ఎన్ కౌంటర్ పై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.దీనిపై తమకు సమాధానం చెప్పాలని సూచించింది. ఎన్కౌంటర్ ను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసినట్లు జాతీయ మానవ హక్కుల సంఘం తెలిపింది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి నిజ నిర్ధారణ కమిటీ ని పంపించాలని, అత్యవసర దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల సంఘం. దీనిపై త్వరితగతిన నివేదిక అందించాలని పేర్కొంది.

NHRC issues notices to Telangana police on encounter,disha  muder, encounter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *