నిధికి ఇదే సరైన స్థావరం

Nidhi agerwal to romance Pawan Kalyan

నిధి అగర్వాల్.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మూడు సినిమాల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో విజయం అందుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక తను దూసుకుపోతుందనుకున్నారు. బట్ అలా జరగలేదు. ఇంకా చెబితే ఏ మాత్రం వేగం అందుకోలేదు. దీంతో తమిళ్ లోనూ ఓ సినిమాకు ఒప్పుకుంది. అయితే కాస్త ఆలస్యమైనా తనకు బంపర్ ఆఫర్ వచ్చింది. అది కూడా ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అనూహ్యమైన వేగంతో దూసుకుపోతోన్న పవన్ కళ్యాణ్ లాయర్ సాబ్ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. దీనికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ అనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఇది రాబిన్ హుడ్ తరహా కథ అనీ.. లండన్ లోని కోహినూర్ డైమండ్ ను తెచ్చే పాత్రలో పవన కనిపిస్తాడనీ చెబుతున్నారు. ఇందులో ఎన్ని నిజాలున్నాయనేది తేలాల్సి ఉంది. ఇక ఈ సినిమాలోనే హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఎంచుకున్నాడు దర్శకుడు క్రిష్.
అయితే ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తనది హీరోకు పెయిర్ కాదని.. వేరే సెపరేట్ ట్రాకులో ఉంటుందంటున్నారు. మొత్తంగా ఇన్నాళ్లూ తన అందాల నిధికి సరైన స్థావరం చూస్తోన్న ఈ ఇస్మార్ట్ బ్యూటీకి ఫైనల్ గా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ దొరికింది. ఇక ఈ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కు వెళుతుందనేది చూడాలి.

Nidhi agerwal to romance Pawan Kalyan, #NidhhiAgerwal,#PawanKalyan,#Krish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *