నిర్భయ దోషులకు సోమవారం ఉదయం 5 గంటలకు ఉరిశిక్ష

nirbhaya accused will hanged on Dec 16th

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఈనెల 16న (సోమవారం) ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తిహార్‌ జైలు అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు జైలు అధికారలు తెలిపారు. ప్రస్తుతం వారున్న తిహార్‌ జైలులోనే వారిని ఉరి తీయనున్నారు. ఈ మేరకు జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాగా దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంతో ఉరిశిక్షకు లైన్‌క్లియర్‌ అయ్యింది. కాగా 2012 డిసెంబర్‌ 16న ఆరుగురు కలిసి నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్‌ 16నే నలుగురు దోషులను ఉరి తీస్తుండటం విశేషం. దోషుల్లో ఒకరు జూవైనల్‌ కస్టడీలో ఉండగా.. మరో దోషి రామ్‌సింగ్‌ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ అనంతరం ప్రజల దృష్టి నిర్భయ ఘటన దోషులపైకి మళ్లిన విషయం తెలిసిందే. ఘటన జరిగి ఏడేళ్లకు పైగా గడుస్తున్నా.. దోషులకు పడిన ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడంలేదని మహిళా సంఘాలతో సహా.. పలువురు ప్రముఖలూ ప్రశ్నిస్తున్నారు. శిక్ష అమలు చేయకపోవడంపై నిర్భయ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా జైలు అధికారుల నిర్ణయంతో వారి డిమాండ్‌ నెరవేరింది…

nirbhaya accused will hanged on dec 16th,2012 Delhi gang rape,Nirbhaya killers,Accused in Nirbhaya case,Supreme Court,Tihar Jail,nirbhaya accused Will Hanged At Tihar Jail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *