బక్సర్ జైలులో ఉరితాళ్లు సిద్ధం చేయమని అధికారుల ఆదేశం

Nirbhaya case final Stage

7 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ అత్యాచార కేసుకు సంబంధించి దోషులకు ఉరిశిక్ష వేయాలని నిర్ణయించారు. నిర్భయ నిందితులకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ లోని బక్సర్ జైలుకు ఓ సందేశం వచ్చింది. డిసెంబరు 14 నాటికి 10 ఉరితాళ్లను సిద్ధం చేయాలన్నది ఆ సందేశంలోని సారాంశం. ఉరితాళ్లను రూపొందించడంలో బక్సర్ జైలుకు ఎంతో పేరుంది. పార్లమెంటు దాడుల సూత్రధారి అఫ్జల్ గురును ఉరితీసేందుకు ఉపయోగించిన తాడును కూడా ఈ జైల్లోనే తయారుచేశారు. తాజాగా, మరోసారి ఉరితాళ్లు పంపించాలని జైళ్ల డైరెక్టరేట్ నుంచి వచ్చిన సందేశం ద్వారా ఆ ఉరితాళ్లు నిర్భయ నిందితుల కోసమేననని భావిస్తున్నారు. దీనిపై బక్సర్ జైలు సూపరింటిండెంట్ విజయ్ కుమార్ అరోరా మాట్లాడుతూ, ఉరితాళ్లు తయారుచేయాలంటూ సూచనలు వచ్చింది నిజమేనని, వాటిని ఎవరి కోసం ఉపయోగిస్తారన్నది తమకు తెలియదని స్పష్టం చేశారు. మొత్తానికి 10 ఉరితాళ్లు సిద్ధం చేయమని బీహార్లోని బక్సర్ జైలుకు సందేశం పంపించిన నేపద్యంలో నిర్భయ కేసు దోషుల కోసమే అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా జరుగుతోంది.

tags : Nirbhaya case, death punishment, bihar, baksar jail, hanging rope

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *