లేదు లేదంటూనే అనుష్క సైతం

6
Anuskha movie update
Anuskha movie update

Nissabdam in OTT

గ్లామర్ తారగా ఎంట్రీ ఇచ్చి అరుంధతిలా అదరగొట్టి ఆ తర్వాత టాలీవుడ్ కే దేవసేనలా మారిన బ్యూటీ అనుష్క. బాహుబలితో నేషనల్ వైడ్ గా ఫేమ్ అయినా.. ఆ ఫేమ్ ను వాడుకునేందుకు ఇప్పుడు తన వద్ద వయసు లేదు. మునుపటి గ్లామరూ లేదు. అందుకే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తోంది. బాహుబలి తర్వాత వచ్చిన భాగమతితో ఏకంగా యాభై కోట్ల వరకూ కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ దేవసేన ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమాతో రాబోతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. గతేడాది డిసెంబర్ లోనే వస్తుందనుకున్నారు. సంక్రాంతికి పోటీ బాగా ఉండటంతో జనవరి 26న అన్నారు. తర్వాత ఫిబ్రవరి, మార్చి అంటూ ఫైనల్ గా ఏప్రిల్ 2 ను ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఈ లోగా మార్చి థర్డ్ వీక్ నుంచి లాక్ డౌన్ మొదలైంది. దీంతో ఎప్పటి నుంచో అవుతోన్న ఆలస్యానికి తోడు ఇది మరింతగా పెరిగింది. దీంతో ఓ దశలో ఓటిటిలో విడుదల చేస్తున్నారు అనే రూమర్స్ వచ్చాయి. కానీ వీటిని నిర్మాణ భాగస్వామి కోన వెంకట్ ఖండించాడు. కానీ ఇప్పుడు మాత్రం లేదు లేదంటూనే ఓటిటిలో విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆల్రెడీ అమెజాన్ తో డీల్ కూడా పూర్తయిందని టాక్. అన్నీ కుదిరితే ఆగస్ట్ నుంచే నిశ్శబ్ధం అమెజాన్ లో స్ట్రీమ్ కావొచ్చు అంటున్నారు. చాలాకాలం క్రితం మంచు విష్ణు హీరోగా వస్తాడు నా రాజు అనే సినిమా చేసిన హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా నిశ్శబ్దం. మాధవన్, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. టీజర్ తో ఇంప్రెస్ చేసిన ఈ టీమ్.. మొదట్లో అంచనాలు పెంచింది. కానీ ఆలస్యం వల్ల ఆడియన్స్ లో ఆసక్తీ తగ్గింది. ఏదేమైనా నిశ్శబ్ధం అమెజాన్ లో విడుదలైతే సౌత్ నుంచి ఇదే ఫస్ట్ బిగ్ మూవీ అవుతుంది. ఆ తర్వాత ఇక ఇతర పెద్ద సినిమాలు కూడా మెల్లగా ఓటిటి రూట్ లోకే వస్తాయనుకోవచ్చు.

tollywood news