అభాసుపాలైన అనుష్క నిశ్శబ్ధం

Nissabdam latest update

అనుష్క.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగింది. బాహుబలి తర్వాత ఆమె రేంజ్ ఎలా మారిందో అందరికీ తెలుసు. బాగా మారింది అనుకుంటున్నారు కదూ. కానీ ఇందులో ఎంత నిజం ఉందనేదే అసలు ప్రశ్న. నిజానికి బాహుబలి క్రెడిట్ రాజమౌళి తర్వాత ప్రభాస్ కే ఎక్కువగా వెళ్లిపోయింది. తర్వాత రానా అందుకున్నాడు. రెండు పార్టుల్లో రెండు వైవిద్యమైన పాత్రలు చేసిన అనుష్కకు కూడా అదే స్థాయిలో క్రేజ్ వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. అందుకు తన లేటెస్ట్ మూవీ నిశ్శబ్ధం సినిమా అందుకు ఓ ఎగ్జాంపుల్. యస్.. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ యేడాది జనవరిమూడో వారంలోనే విడుదల కావాలి. కానీ ఎవరూ కొనలేదు. దీంతో ఫిబ్రవరి, మార్చి అంటూ ఏప్రిల్ వరకూ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఫైనల్ గా ఏప్రిల్ 2న వస్తుందని కన్ఫార్మ్ చేశారు. ఆ సినిమా రాలేదు కానీ కరోనా వచ్చింది. ఆ ఎఫెక్ట్ తో లాక్ డౌన్ విధించడంతో అసలు థియేటర్సే మూతపడ్డాయి. థియేటర్స్ మూతపడి రెండు నెలలవుతోంది. మళ్లీ ఎప్పుడు ఓపెన్ అవుతాయనే గ్యారెంటీ లేదు. ఇటు నిశ్శబ్ధం అప్పులు కూడా నిశ్శబ్ధంగా పెరుగుతూ పోతున్నాయి. దీంతో నిర్మాతలు సినిమాను ఓటిటిలోలో విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ అబ్బే అలాంటిదేం లేదు. మేం థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తాం అని పైకి చెబుతున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర నిర్మాతలు సినిమాను 50 కోట్లకు(అంత సీన్ ఉందా..?) అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు తమ సినిమాను కొనేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ మేమే ఒప్పుకోవడం లేదనే ఫేక్ ఫీలర్స్ వదిలారు.

దీంతో చాలామంది ఇది నిజమే అనుకున్నారు. కానీ అసలు వాస్తవం వేరే ఉంది. అంతా అనుకుంటున్నట్టు నిశ్శబ్ధం చిత్రాన్ని నిజంగానే ఓటిటిలో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఈ నిర్మాతలు 25కోట్లకు అమ్ముతాం అని బేరం పెట్టారు. కానీ అమెజాన్ వాళ్లు 20కోట్లకు కూడా కొనేందుకు ఆసక్తిగా లేరు. ఇది అసలు నిజం. దీన్ని దాచి యాభైకోట్ల దోబూచులాటలు మొదలుపెట్టింది మూవీ టీమ్. మామూలుగా మొదట్లోనే ఈ రేట్ పై చాలామందికి డౌట్స్ వచ్చాయి. కానీ ఏమో.. అనుష్క కదా..? పైగా ఐదు భాషల్లో విడుదల అంటున్నారు .. కాబట్టి 50కోట్ల మాట నిజమేనేమో అనుకున్నారు. బట్.. ఐదు భాషల్లో కలిపి కూడా 20కోట్లు అన్నా అమెజానా అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదుఅనేది నిజం. అంటే ఇంకా బేరాలు చేస్తే ఓ 15కోట్ల వరకూ అమ్మేస్తారేమో.. మొత్తంగా కొన్ని ఫేక్ న్యూస్ ను జనాల్లో గందరగోళం సృష్టిస్తాయి. సాధారణంగా ఇవి రూమర్ రాయుళ్లు క్రియేట్ చేస్తారు. కానీ ఏకంగా సినిమావాల్లే స్ప్రెడ్ చేయడం చూస్తోంటే నిశ్శబ్ధం సినిమాలో ఎంత పస ఉందనేది తెలుస్తూనే ఉంది. మరి ఈ 50 కోట్ల అబద్ధం 20 కోట్ల నిజం గురించి ఇప్పుడు నిర్మాతలు ఏం చెబుతారో చూడాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *