నిశ్శబ్దం ట్రైలర్ బావుంది.. కానీ..?

2
Anuskha movie update
Anuskha movie update

nissabdam trailer

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా నిశ్శబ్దం. మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మాడిసన్ కీలక పాత్రల్లో నటించారు. వచ్చే నెల 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోందీ సినిమా. ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్ తో కొంత వరకూ ఆకట్టుకున్న టీమ్.. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో అదే రేంజ్ లో ఇంప్రెస్ చేసిందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అలాగని బాలేదు అనడానికీ లేదు. ట్రైలర్ ఆసాంతం ఓ మిస్టీరియస్ థింగ్ చుట్టూ తిరుగుతోంది. అయితే ఆ మిస్టరీ( సస్పెన్స్ ను కాదు) ఏంటనేది ట్రైలర్ లోనూ కొంత రివీల్ చేస్తే ట్రైలర్ అంచనాలు పెంచి ఉండేది.  ఓ హాంటెడ్ హౌస్ లోని పెయింటింగ్ కోసం మ్యూజిషీయన్ తో కలిసి వెళ్లిన అనుష్కకు ఆ తర్వాత కొన్ని అనూహ్య సంఘటనలు ఎదురవుతుంటాయి. సినిమాలో షాలినీ పాండే పాత్ర కీలకంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అయితే పోలీస్ లు, అంజలి పాత్ర చాలా హడావిడీగా ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా కనిపించింది. కానీ అందుకు తగ్గ సీన్ సోర్స్ బలహీనంగా ఉండటంతో ట్రైలర్ నేపథ్య సంగీతంతో కొంత హైప్ పెంచే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది.

అంతే కానీ.. అంత హడావిడీ చేయడానికి సరైన సీన్ ఒక్కటైనా ట్రైలర్ లో పడి ఉంటే ఖచ్చితంగా అంచనాలు మారేవి. కాకపోతే ఆ పాయింట్ చాలా కీలకమై ఉంటుందేమో.. అందుకే రివీల్ చేయలేదు అని ప్రస్తుతానికి సర్దుకోవచ్చు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. అనుష్క ఎప్పట్లానే తన నటనతో అదరగొట్టబోతోంది అని తెలుస్తోంది. అంజలి పాత్ర డాషింగ్ గా కనిపించేలా ఉంది. షాలినీ పాండేకు ఖచ్చితంగా కొత్త రోల్ వచ్చినట్టుగా అర్థం చేసుకోవచ్చు. అయితే మాధవన్ పాత్రను డార్క్ సైడ్ లో ఉంచారు. అంటే ఆ పాత్రపై ఎలాంటి డౌట్ రాకుండా చేశారు. దీన్ని బట్టి సినిమాలో కీ పాయింట్స్ అన్నీ అతని చుట్టే తిరుగుతాయని ఊహించొచ్చు. సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ పాత్రల్లో కొత్తదనం ఏంటనేది సినిమా చూస్తే కానీ తెలియదు. మొత్తంగా నిశ్శబ్దం ట్రైలర్ ఊహించినంత సౌండ్ చేయలేదనే చెప్పాలి. మరి సినిమా ఉంటుందో చూడాలి.

 

tollywood news