భీష్మపై ఇది టూమచ్ గురూ ..

nitin bheeshma title controversy

భీష్మ.. నితిన్, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా. చాలా వరకూ పాజిటివ్ బజ్ తో ఈ నెల 21న విడుదల కాబోతోందీ చిత్రం. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై కొందరు హిందూత్వ వాదులు చేస్తోన్న రచ్చ ఖచ్చితంగా ఆక్షేపణీయమే. భీష్మ  అనే టైటిల్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిలా ఉందట.. ఈ సినిమాలో భీష్మను రొమాంటిక్ బాయ్ గా చూపించారట. అందువల్ల వాళ్లవి దెబ్బతింటాయట. ఇలా చెబుతూ ప్రెస్ మీట్స్ పెడుతూ టైటిల్ ను మార్చకపోతే మా దమ్మేంటో చూపిస్తాం అంటూ రచ్చ మొదలుపెట్టారు. కానీ తరచి చూస్తే ఇదో వేస్ట్ బ్యాచ్ అని అర్థమౌతుంది. ఎందుకంటే ఈ టైటిల్ ఈ వారంలో రివీల్ అయింది. మూడు నెలల క్రితమే వచ్చింది. అయినా వీళ్లు ఇప్పుడు విడుదలకు ముందు రచ్చ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ల ‘ఉద్దేశ్యం’ వేరే అయి ఉంటుందని ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఈ టైటిల్ తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ లోనే అతను ఎలాంటి వాడో చెప్పాడు. తర్వాత వచ్చిన టీజర్ లో కూడా భీష్మ లవర్ బాయ్ అనే ఉంది. మరి అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయంటే దీని వెనక వాళ్లు ఏం ‘ఆశిస్తున్నారో’ సులభంగా అర్థం చేసుకోవచ్చు.

గతంలో వాల్మీక టైటిల్ విషయంలోనూ ఇదే చేశారు. కానీ దర్శకుడు కాంప్రమైజ్ అయిపోయాడు. నిజానికి వాల్మీకి అనే టైటిల్ ఆ సినిమాకు బాగా సరిపోతుంది. అయినా విషయం తెలియకుండానే రచ్చ చేశారు.ఇక ఇలా ప్రతి టైటిల్ కూ మావి దెబ్బతింటాయి మావి దెబ్బతింటాయి మనోభావాలు అంటూ రచ్చ చేస్తే తెలుగులో ఇకపై ఎలుక, పిల్లి, కుక్క అనే టైటిల్స్ మాత్రమే మిగులుతాయి. ఎందుకంటే వాటివి దెబ్బతినవు.. తిన్నా చెప్పలేవు కాబట్టి.

nitin bheeshma title controversy,Nitin,Rasmika,Venky Kudumula,Tollywood Latest Controversy,Bheeshma Movie Controversy,Hindus Fires On Bheeshma Title

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *