నిత్య మీనన్ ఏంటీ ఇట్టా అయిందీ..?

4
nitya in gamanam
nitya in gamanam

nitya in gamanam

టాలీవుడ్ లో ఈ మధ్య అనౌన్స్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ ‘గమనం’. శ్రియ ప్రధాన పాత్రలో ప్యాన్ ఇండియన్ సినిమాగా ఏకంగా ఆరుభాషల్లో విడుదల కాబోతోన్న సినిమా ఇది. సుజనా కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మూవీ ఇది. మొన్నా మధ్య శ్రియ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. శ్రియ ఇమేజ్ కు భిన్నమైన లుక్ తో ఓ కొత్త తరహా పాత్రలో తనను చూడబోతున్నాం అనే ఇంప్రెషన్ వేశారు. అలాగే తన పాత్ర కూడా ఛాలెజింగ్ గా ఉంటుందట. శ్రియ ఓ మూగ మహిళ పాత్రలో కనిపించబోతోంది. అయితే అనుకోకుండా ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ వదిలారు. అది నిత్యా మేనన్ ది. ఇది ఎవరూ ఊహించలేదు. గమనంలో నిత్యమీనన్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయకపోవడంతో అంతా సర్ ప్రైజ్ అయ్యారు. నిత్య లాంటి టాలెంటెడ్ యాక్ట్ర్రెస్ గమనం వంటి ప్రాజెక్ట్ లో ఉండటం సినిమాకు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడే ఓ చిక్కొచ్చింది.

ఈ లుక్ లో నిత్య మీనన్ చూసిన జనం భయపడేలా ఉన్నారు. మరీ యాభైయేళ్ల ఆంటీలా కనిపిస్తోంది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళగా సంగీతంలో రాణించే పాత్రలో ఆమె కనిపించబోతోంది అన్నట్టుగా ఆ లుక్ ఉంది. అయితే లుక్ మరీ చబ్బీగా ఉంది. నిత్య కూడా మరీ ఏజ్ బార్ అయినట్టుగా మారిపోయింది. తన వయసుతో పోలిస్తే ఆ లుక్ దారుణంగా ఉందనే చెప్పాలి. కాకపోతే తన టాలెంట్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ అవుతుంది. మొత్తంగా ఇళయారాజా సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా తెలుగు సంభాషణలు రాస్తుండటం విశేషం. మరి ఈ గమనం బాక్సాఫీస్ వద్ద విజయ తీరాల వైపు పయనిస్తుందో లేదో చూడాలి.

tollywood news