హాట్ టాపిక్ గా నిత్య మీనన్ లిప్ లాక్

4
Nitya menon lip lock
Nitya menon lip lock

Nitya menon lip lock

నిత్య మీనన్.. సౌత్ లోని మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు. వైవిధ్యమైన కథలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ.. ఎక్స్ పోజింగ్ కు ఆమడ దూరం అంటూ కెరీర్ సాగిస్తోన్న నిత్య కొన్నాళ్లుగా విపరీతంగా ఒళ్లు పెరగడంతో సౌత్ లో పెద్దగా కనిపించడం లేదు. ఆ పర్సనాలిటీతో రెగ్యులర్ హీరోయిన్ గా అలరించడం సాధ్యం కాదు. అందుకే తను కూడా పెద్దగా ఇలాంటి సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు. అయితే లాస్ట్ ఇయర్ అమ్మడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘మిషన్ మంగళ్ యాన్’తో హిందీ ఆడియన్స్ కు కూడా తన టాలెంట్ చూపించింది. ఆ టాలెంట్ వల్లే తనకు అక్కడ మరో ఆఫర్ వచ్చింది. అదే ‘బ్రెత్ ఇన్ టూ ద షాడోస్’అనే వెబ్ సిరీస్. ఈ సిరిస్ లో అభిషేక్ బచ్చన్ సరసన నటించిన నిత్య నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.

అయితే ఇప్పటి వరకూ సౌత్ లో ఎలాంటి ఎక్స్ పోజింగ్ కూడా ఓకే చెప్పని తను ఏకంగా అక్కడ ఆ వెబ్ సిరీస్ లో ఏకంగా ఓ హాట్ లిప్ లాక్ చేసి షాక్ ఇచ్చింది. మొదట్లో దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే సిరీస్ కు కాస్త స్లో పేజ్ అన్న టాక్ వచ్చిందో.. అప్పుడు స్ట్రాంగ్ గా రివీల్ చేయడమే కాదు.. ఏకంగా ఇదే పేరుతో ప్రచారం కూడా మొదలుపెట్టారు. దీంతో సౌత్ ఆడియన్స్ అంతా ఒక్కసారిగా బ్రెత్ ఇన్ టూ ద షాడోస్ అంటూ తెగ వెదుకుతున్నారు. అయితే ఇందులో ఓ పార్ట్ లో నిత్య మీనన్ నిజంగానే ఆ సీన్ లో నటించింది. పైగా ఇది లెస్బియన్ సీన్ కావడంతో మరింత షాక్ అవుతున్నారు ఆడియన్స్. అంటే హిందీలో అడుగుపెట్టింది కాబట్టి.. అమ్మడు ఆ రూట్ లోనే అడుగులు వేస్తోంది అనుకోవాలా లేక ‘సీన్ డిమాండ్’ మేరకు మాత్రమే ఇలా చేసిందనుకోవాలా..?

tollywood news