చిన్నారులకు సర్ ప్రైజ్

Spread the love

No Bag Day For AP school Childrens

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. తొలిసంతకం వృద్ధుల పెన్షన్ పై పెట్టిన జగన్ పాలనలో మార్పులు చేసుకుంటూ పోతున్నారు. తాజాని కూడా త్వరలో అందించనున్నారు. ఇక నుంచి పాఠశాలల్లో ప్రతి రెండో, నాల్గో శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని విద్యాశాఖ ప్రయత్నాలు ప్రాగా ఆయన విద్యాశాఖపై ఫోకస్ పెట్టారు. పాఠశాల విద్యలో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. అమ్మ ఒడి పథకానరంభించింది. విద్యార్థులకు రోజు వారీ పాఠాల బోధన, పుస్తకాల మోతకు భిన్నంగా ఆట పాటలతో ఉత్సాహ పరచాలనుకుంటున్నారు. దీంతో పాటు ప్రతిరోజు అరగంట ఆనంద వేదిక తరగతులు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పాఠశాల విద్యార్థులకు రోజువారీ పాఠాల బోధన, పుస్తకాల మోతలకు భిన్నంగా ఆట, పాటలతో వారిలో పాఠశాలంటే భయం పోగొట్టడం పాఠశాలలో వారిని ఆనందంగా ఉంచేందుకు దీన్ని తీసుకొస్తున్నారు. ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతోపాటు ఆనందవేదిక తరగతులను ప్రవేశపెట్టనున్నారు.ప్రతిరోజు ఉదయం అర్ధగంటపాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే భూటన్‌తో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది.ప్రతీ నెలలో రెండు నాలుగో శనివారల్లో నో బ్యాగ్ డేను అమలు చేయాలనుకుంటున్నారు. కార్పొరేట్ స్టైల్స్‌లో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కూడా నో బ్యాగ్ డేను నిర్వహించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. పిల్లలకు ఆరోజు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలతో ప్రతిభ పాఠవాలతకు పదును పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడ కొత్త సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తున్నారు. పిల్లలపై చదువుల భారం పెరగకుండా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇక జగన్ లాగా తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా ఒక రోజు బ్యాగ్ హాలీడే ప్రకటిస్తే పిల్లలకు ఒకరోజైనా బ్యాగుల మోత తగ్గుతుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *