ఆర్టీసీ బస్సులు స్టార్ట్

No City Buses In KCR

రేపు ఆర్టీసీ ప్రారంభం అవుతుందని హైదరాబాద్ మాత్రం సిటీ బస్ లు నడువవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆటో-టాక్సిలు నడిపించుకోవచ్చని అన్నారు. 1+3 ప్రకారం ఆటో-టాక్సీ నడుపుకోవాలని, సెలూన్ షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ-కామర్స్ 100 శాతం ఓపెన్ చేసుకోవచ్చని చెప్పారు. నీటి వాటాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని, రాయలసీమకు గోదావరి నీళ్లను వాడుకోవాలి నేను ఎప్పుడో చెప్పానని తెలిపారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకొమన్నారు. గోదావరి నదీజలాల తెలంగాణ వాటా పై కమిటీ వేశామన్నారు. అంతర్రాష్ట్ర బస్సులు నడుపమని, ఆర్టీసీ బస్సుల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. పరిశ్రమలు-ఫ్యాక్టరీలు కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. అన్ని మతాల ప్రార్ధనలు-ఉత్సవాలు ఉండవని చెప్పారు. సభలు-ర్యాలీలు-విద్యా సంస్థలు అన్ని క్లోజ్ ఉంటాయన్నారు. బార్లు-స్టేడియాలు-జిమ్ లు అన్ని మూసి ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని లేదంటే ఫైన్ వేస్తారని తెలిపారు.  ఇంకా ఆయన ఏమన్నారంటే..

* దేశంలో రైతుబంధు పథకం ఎక్కడా లేదు. రైతుబీమా సదుపాయాలు పెరుగుతూ వస్తోంది. మైక్రో ఇరిగేషన్ వంద శాతం సప్సిడ్ టి-సర్కార్ ఇస్తుంది. కల్తీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ పెడుతున్నాం. తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. తెలంగాణ రైతాంగం నియంతృత వ్యవసాయం చేయాలి. కాటన్ పంటకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తాం. గత ఏడాది 1 కోటి 23 లక్షల ఎకరాల్లో రెండు పంటలు కలిపి వచ్చింది. ఈ ఏడాది కోటి 33 లక్షల ఎకరాల పంటలు వేస్తరని అంచనా. 70 లక్షల ఎకరాల్లో పత్తి వేయాలి. 40లక్షల ఎకరాల్లో వరి పంటలు వెయ్యాలి. పత్తి-వరి ఏ రకమైన వరి వెయ్యాలి అనేది ప్రభుత్వం చెప్తది. వర్షాకాలంలో మక్కా కాకుండా కందులు వేయల’ని సీఎం కేసీఆర్ అన్నారు.

 

Telangana Live News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *