చివ‌రి కోరిక ఏమిటి?

No last wishes for Nirbhaya convicts

దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిర్భ‌య అనే యువ‌తిని న‌లుగురు రాక్ష‌సులు అతి దారుణంగా క‌దుతున్న బ‌స్సులో కిరాత‌కంగా అత్యాచారం చేసి చంపేసిన ఘ‌ట‌న మ‌ర్చిపోలేనిది. యావ‌త్ భార‌త్ ఉలిక్కిప‌డ్డ సంఘ‌ట‌న అది. అత్యాచారం చేసి ఇనుప‌రాడ్లు ప్ర‌యివేటు ప్లేస్‌లో దూర్చి దారుణంగా హింసించి బ‌స్సు నుండి క‌నిక‌రం లేకుండా కింద ప‌డేశారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చ‌నిపోయింది. దీంతో ఆ న‌ర‌రూప రాక్ష‌సుల‌ను బ‌హిరంగంగా ఉరి తీయ్యాలంటూ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఇక‌పోతే ఘ‌ట‌న జ‌రిగి 8ఏళ్లు అవుతుంది. ఇన్నాళ్లు జైళ్లో ఆ కిరాత‌కుల‌ను క‌డుపునిండా మేపింది ఈ దేశం. ఏదైతేనేం ఎట్ట‌కేల‌కు ఆ రాక్ష‌సుల‌కు ఉరి ఖ‌రారైంది. నిర్భయ దోషులైన వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌(31), ముఖేష్‌ కుమార్‌ (32), పవన్‌(26)లను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6గంటలకు ఉరి తీయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఉరి వేసేముందు దోషుల చివ‌రి కోరిక‌లు తీర్చ‌డం అనేది మొద‌టి నుండి జ‌రుగుతున్న‌దే. ఈ మేర‌కు నిర్భ‌య దోషుల‌ను కూడా చివ‌రి కోరిక అడ‌గ‌గా అధికారుల‌కు ఎటువంటి స‌మాధానం ఇవ్వ‌లేదు దోషులు. తమ చివరి కోరిక ఏమిటో చెపితే దాన్ని తీర్చగలుగుతామా లేదా అన్న విషయాన్ని జైలు అధికారులు పరిశీలిస్తారు.

No last wishes for Nirbhaya convicts,Nirbhaya convicts tense,eating less,no last wish yet,What Is Last Wish For Nirbhaya Accused,Nirbhaya gangrape-murder,Nirbhaya’s killers

Related posts:

అమరసైనిక కుటుంబాలకు పవన్ కోటి విరాళం...
ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కు డెడ్ లైన్...
భారతీయుడు2 షూటింగ్‌లో దారుణం..3 డైరెక్టర్లు మృతి
హస్తినకు జనసేనాని .. ఎందుకంటే
నితీష్ ఎన్డీయేలో కొనసాగక్కర్లేదు?
వంద మొక్కలు నాటాల్సిందిగా హైకోర్టు శిక్ష  
మార్చి3న నిర్భయ దోషులకు ఉరి ..
రైల్లో శివుడికి బెర్త్ .. మండిపడిన ఓవైసీ
ఇంధన సమస్యతో అత్యవసరంగా ఛాపర్..
జేడీకు ఆ పార్టీ నుండి ఆహ్వానం...
ఐ-ప్యాక్ డైరెక్టర్ వివాహం ..వెళ్తున్న సీఎం జగన్
టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చిన సుప్రీం...
నేడే కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం
68 మంది విద్యార్థినుల అండర్ వేర్ విప్పించి...
హైదరాబాద్ లో మంత్రి నిర్మలా సీతారామన్...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *