తహసీల్దార్‌ హసీనాబీకి ఆశ్రయం ఇస్తే కేసు

NO SHELTER TO GUDURU TAHASILDAR

గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ ఏసీబీ కేసులో ముద్దాయిగా ఉన్నారని, ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కేసు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం హెచ్చరించారు. తన వ్యక్తిగత సహాయకుని ద్వారా లంచం తీసుకున్న గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ ఇంకా పరారీలో ఉన్నారని తెలిపారు. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆమె కోసం పలు బృందాలు గాలిస్తున్నారు. ఆమె గురించి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. అలాగే తహసీల్దార్‌ హసీనాబీ సూచనల మేరకు లంచం తీసుకున్న మహబూబ్‌బాషాను శనివారం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.

GUDURU MRO LATEST NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *