దుబ్బాకలో కరోనా లేదా?

6
No Social distance Dubbaka Elections
No Social distance Dubbaka Elections

No Social distance Dubbaka Elections

కరోనాతో భారత్ పోరాటం చేస్తుందని, పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నరేంద్ర మోడీ నిన్ననే జాతినుద్దేశించి మాట్లాడారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించినా తెలంగాణ ప్రభుత్వానికి పట్టడం లేదు. ‘మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి’ అని పదే పదే చెప్పే టీఆర్ఎస్ నాయకులు, మంత్రులే కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు కరోనా బారిన పడినా కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కరోనాను పక్కకు పెట్టి దుబ్బాకలో ప్రచారం చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అధికార పార్టీయే ఇలా చేస్తేలా ఎలా అని ప్రజలు మండిపడుతున్నారు. దుబ్బాకలో జరుగుతున్న టీఆర్ఎస్ ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు, సమావేశాల్లో కార్యకర్తలు ఎక్కడా కూడా మాస్కులు ధరించడం లేదు. కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు. రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీశ్ రావు చేస్తున్న ప్రచారంలో అడుగడుగునా నిర్లక్యం కనిపిస్తోంది. జాగ్రత్తలు చెప్పాల్సిన అధికార పార్టీయే ఇలా చేస్తే ఎలా అని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.