నేషనల్ హైవేలపై నో స్పీడ్ బ్రేకర్స్..

No Speed Breakers On National Highway’s

జాతీయ రహదారిపై ముఖ్యంగా టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టింది నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ). వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేందుకు వీలుగా జాతీయ రహదారులపై ఉండే అన్ని స్పీడ్‌బ్రేకర్లను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించింది. ‘జాతీయ రహదారులపై స్పీడ్‌ బ్రేకర్లను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాం. హైవేలపై ముఖ్యంగా టోల్‌ గేట్ల వద్ద ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. టోల్‌ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ సమర్థవంతంగా అమలవుతుండటంతో అక్కడ ఉండే స్పీడ్‌ బ్రేకర్లు, రంబుల్‌ స్ట్రిప్స్‌ను తక్షణమే తొలగిస్తున్నాం’ రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

టోల్‌ ప్లాజాల వద్ద ఉండే స్పీడ్‌ బ్రేకర్ల వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేగాక, వాహనాలు పాడవడం, ఇంధన వినియోగం పెరగడం లాంటివి జరుగుతున్నాయని తెలిపింది. ఈ డ్రైవ్‌తో అటు వాహనదారులకు, ఇటు ప్రభుత్వానికి ఎంతో  సమయం, డబ్బు ఆదా అవుతుందని వెల్లడించింది. నిబంధనలకు లోబడే ఈ స్పీడ్‌ బ్రేకర్లను తొలగిస్తున్నట్లు చెప్పింది. ఇంధన వినియోగం తగ్గితే కాలుష్యం కూడా తగ్గుతుందని పేర్కొంది. ముఖ్యంగా అంబులెన్స్‌ లాంటివి త్వరగా వెళ్లేందుకు వీలుంటుందని వెల్లడించింది.  గతేడాది డిసెంబరు 15న టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ పద్ధతిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా వాహనదారులు టోల్‌గేట్‌ వద్ద ఆగి డబ్బులు చెల్లించాల్సిన పని ఉండదు. ఫాస్టాగ్‌ కార్డుతో ఎలక్ట్రానిక్‌ రూపంలో కట్టేయ్యొచ్చు. ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Highways Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *