మహేష్ – పరశురామ్ కథే లేదా..?

No story in Mahesh parasuram?

సరిలేరు నీకెవ్వరు అంటూ ఈ యేడాది ఆరంభంలో సూపర్ హిట్ అందుకున్నాడు మహేష్ బాబు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈమూవీకి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా కమర్షియల్ గా సూపర్ హిట్ అనే అనిపించుకుంది. ఎప్పట్లానే అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ లో చేతులెత్తేశాడు అన్నారు. మొత్తంగా ఈ మూవీ తర్వాత మహర్షి నుంచి చెబుతున్నట్టుగా వంశీ పైడిపల్లితో సినిమా అనుకన్నారు. బట్ అనూహ్యంగా ఆ కాంబినేషన్ ఆగిపోయింది. అంతే సడెన్ గా సీన్ లోకి పరశురామ్ వచ్చాడు. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ భారీగా పెంచిన పరశురామ్ ఆ కారణంగానే చాలా కాలంగా సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఫైనల్ గా నాగచైతన్యతో సినిమా ఓకే అయింది. సమ్మర్ లో ఓపెనింగ్ అనుకున్నారు. ఈ లోగా మహేష్ నుంచి కాల్ వచ్చింది. కట్ చేస్తే అతను అర్థాంతరంగా చైతూ సినిమాను వదిలేసి మహేష్ వైపు వచ్చాడు. అయితే కొన్ని రోజులుగా ఈ మూవీ గురించి నిరంతరం వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో వచ్చే సినిమాలో ఇప్పటి వరకూ హీరోయిన్ దొరకలేదు. ఇతర పాత్రల్లో ఎవరు నటిస్తున్నారన్న క్లారిటీ లేదు. మామూలుగా ఏప్రిల్ చివర్లోనే ప్రారంభం కావాల్సిన సినిమాకు ఇప్పటి వరకూ వీటికి సంబంధించి చిన్న క్లూ కూడా లేదంటే అనుమానాలు వస్తున్నాయి కదా..

మరోవైపు ఇదో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నా.. అందుకు తగ్గట్టుగా ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. ఇక తాజాగా సోషల్ మీడియాలో మహేష్ బాబును చూస్తే రకరకాల లుక్కుల్లో కనిపిస్తున్నాడు. హీరోయిన్ లేకపోవడం, ఆర్టిస్టుల ఎంపిక పూర్తి కాకపోవడం, టెక్నీషియన్స్ ఫైనల్ కాకపోవడంతో పాటు మహేష్ బాబు లుక్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతోన్న మాట ఏంటంటే.. అసలు ఈ కాంబినేషన్ లో సినిమాకు అసలు ఇప్పటి వరకూ సరైన కథే ఫైనల్ కాలేదట. అందుకే ఇంకా ఇతర ఆర్టిస్టులను సెలెక్ట్ చేయలేదు. అలాగే కథ రెడీగా ఉండి ఉంటే మహేష్ కూడా ఏదో ఒక లుక్ మెయిన్టేన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ కు పర్మిషన్ వచ్చిన వెంటనే షూటింగ్ కు వెళ్లాలి కాబట్టి ఆ లుక్ తో ప్రిపేర్ గా ఉంటాడు.  ఇవేవీ లేవు కాబట్టి.. అసలు కథే లేదు అనేది కొందరి వాదన. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం అందులోనూ నిజం ఉందట. పరశురామ్ ఏదో లైన్ చెప్పాడు. అది మహేష్ కు గతంలోనే నచ్చింది. కానీ బౌండ్ స్క్రిప్ట్ లేదు. అందుకే ఈ సినిమాకు ఇన్ని బాలారిష్టాలు అంటున్నారు. ఒక్కోసారి సరదాగా అనుకున్న విషయాలు కూడా కొన్ని వాస్తవాలు చెబుతాయి.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *