ముగిసిన పంచాయితీ సర్పంచ్ ల నామినేషన్

Spread the love

nomination process of panchayat sarpanch was closed … అధికార పార్టీ నాయకులదే జోరు

అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. గ్రామాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ చాలా గ్రామాలను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నం చేస్తుండగా ప్రత్యర్థి పార్టీలు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో నైనా పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకు ఆయా పార్టీల్లో ఉన్న అంతర్గత సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలోని అన్ని గ్రామాల్లో జరగనున్న మొదటివిడత గ్రామపంచాయితీ ఎన్నికలకి సంబందించిన నామినేషన్స్ పూర్తయ్యాయి…
సర్పంచ్‌ స్థానాలకు అన్ని గ్రామాల్లోకూడా అధికార తెరాస పార్టీ అభ్యర్థులే అధికంగా పోటీ పడుతున్నారు. ఈ విషయంలో అన్ని నియోజక వర్గాల ప్రతినిధులు జోక్యం చేసుకునేందుకు ఆసక్తిగా లేరు. కానీ అవసరమున్న గ్రామాల్లో మండల స్థాయి నాయకులే సమన్వయ పరుస్తున్నారు. ఒక మండలానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో మినహా మిగతా అన్ని చోట్ల పోటీ గట్టిగానే ఉండబోతుంది. అంతే కాకుండా కొన్ని కొన్ని గ్రామాల్లోఇప్పటికే ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి… కొత్తగా తెలిసిన విషయమేంటంటే కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అంతగా సుముఖంగా లేరని సమాచారం.

ఈ పంచాయితీ ఎన్నికల విషయాలలో ఏకగ్రీవం అంశాన్ని ప్రస్తావించొద్దని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో మాత్రం ఆ మాటలని పెడ చెవినపెట్టారనిసమాచారం. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు వేలం పాటలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసుశాఖ సైతం హెచ్చరించింది. దీంతో ఒకటీ, రెండు గ్రామాల్లో రహస్యంగా వేలం పాటలు జరిగాయనే ఊహాగానాలు వినిపించాయి. అధికారులు మాత్రం అలాంటివి ఏమి జరగలేదని చెప్పడం గమనార్హం. ఇక నామినేషన్లు ముగియడంతో ప్రచార పర్వం స్టార్ట్ అయింది. గ్రామాల్లో రాజకీయాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.ఇక ఈ పంచాయితీ పోరులో కూడా అధికారా టీఆర్ఎస్ పార్టీ నే ప్రస్తుతానికి జోరు మీదుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *