నోముల పేద‌ల ప‌క్ష‌పాతి

4
Nomula is a poor partisan
Nomula is a poor partisan
Nomula is a poor partisan

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి

  • శాసనసభలో న‌ర్సింహ‌య్య‌ సంతాప తీర్మానం లో మంత్రి ఎర్ర‌బెల్లి వ్యాఖ్యానం

నోముల న‌ర్సింహ‌య్య పేద‌ల ప‌క్ష‌పాతి. త‌న జీవితాంతం పేద ప్రజల కోసం పోరాటం చేసిన ప్ర‌జా నాయ‌కుడ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభి‌వృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి త‌న రాజకీయ జీవితాన్ని అంకితమిచ్చిన నేతని ఆయన కొనియాడారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన దివంగత నోముల నరసింహ్మయ్య సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడారు.

క‌మ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తితో టిఆర్ఎస్ లో చేరి, త‌న జీవిత కాలం మొత్తం పేద‌ల కోసం ప‌ని చేసిన నేత‌గా నోముల న‌ర్సింహ‌య్య‌ను ఎర్ర‌బెల్లి పేర్కొన్నారు. నాటి సీనియ‌ర్ ఎమ్మెల్యే న‌ర్రా రాఘ‌వ‌రెడ్డి శిష్యుడిగా, రాజ‌కీయ ప్ర‌వేశం చేసి, అనేక ప్ర‌జా ఉద్య‌మాల్లో పాల్గొన్నారు. లాయ‌ర్ గా కూడా పేద‌ల కేసుల‌ను వాదించి పేరు తెచ్చుకున్నారు. వ‌రంగ‌ల్ ఆడ బిడ్డ‌ను పెండ్లి చేసుకున్నారు. అని నోముల‌తో త‌న‌కున్న ప‌రిచ‌యాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి నెమ‌రు వేసుకున్నారు. అనేక విష‌యాల్లో తాను నోముల క‌లిసి ప‌ని చేశామ‌న్నారు. అసెంబ్లీలో నోముల త‌న గురువు లాగే అద్భుతంగా మాట్లాడేవార‌న్నారు. మంచ వాక్ప‌టిమ గ‌ల నేత‌గా చెప్పారు. అలాంటి నేత మ‌ర‌ణం అత్యంత బాధాక‌ర‌మ‌ని, వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

 

Telangana live news