రేవంత్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Non-bailable case filed against Revanth Reddy

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపద్యంలో తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్న ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన విపక్షాల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో, పోలీసుల కళ్లుగప్పి బైక్ పై వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఆయన్ని తోసివేశారన్న అభియోగాలతో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. సోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వేళ, తనను అడ్డుకున్న ఎస్ఐ నవీన్ రెడ్డిని రేవంత్ పక్కకు తోసేశారు. ఈ ఘటనలో నవీన్ రెడ్డికి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు. రేవంత్ పై ఐపీసీలోని సెక్షన్ 341, 332, 353ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు. మొత్తానికి దూకుడు మీద ఉన్న రేవంత్ రెడ్డి పై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

TAGS : congress party, revanth reddy, pragathi bhavan protest , SI Naveen reddy ,police complaint , non bailable case

ఆ ట్రక్కులో 39 మంది మృతదేహాలు..

డెంగ్యూ జ్వరాల పై హైకోర్టు సీరియస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *