ఛలో అసెంబ్లీ పై అలెర్ట్ .. టీడీపీ, జేఏసీ నేతలకు నోటీసులు

Notices to TDP JAC For Chalo Assembly

ఏపీలో సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఇక సోమవారం నాడే సీఎం జగన్ రాజధాని విషయంలో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ నేపధ్యంలో  టీడీపీ, అమరావతి జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీ  పిలుపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సెక్షన్ 149 కింద పోలీసులు ఇప్పటికే టీడీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. గృహ నిర్బంధాలపై పోలీసులు హెచ్చరించారు. హింసాత్మక చర్యలను నిరోధించడానికి టీడీపీ నాయకులతో పాటు షాడో పోలీసులు ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి అచ్చెనాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేసారు. మరోవైపు చంద్రబాబు నాయుడు టీడీఎల్‌పీ సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరి ఆత్మకూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది . రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అమలు చేయాల్సిన వ్యూహంపై చర్చించడానికి అన్ని ప్రాంతాల నాయకులు వచ్చారు . టీడీపీ రాజధాని విషయంలో తమ స్టాండ్ గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకుంది. మరోపక్క రాజధాని రైతులకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. వామపక్ష పార్టీల నాయకులను సైతం పోలీసులు నోటీసులిచ్చి హెచ్చరించారు.

Notices to TDP JAC For Chalo Assembly,AP capital, capital amaravati , CM Jagan mohan reddy ,ap cabinet, aseembly , notices, tdp, cpi leaders, acchennayudu , chandrababu naidu, amaravati jac

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *